)
Teacher Brutally Beat Student: చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన సంఘటన జరిగింది. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక సాత్విక నాగశ్రీని హిందీ ఉపాధ్యాయుడు తలపై స్కూల్ బ్యాగ్‌తో కొట్టాడు. క్లాసులో అల్లరి చేస్తోందని ఆమెను శిక్షించే క్రమంలో ఈ ఘటన జరిగింది.
బాలిక తల్లి విజేత అదే పాఠశాలలో పనిచేస్తుంది. మొదట ఈ ఘటనను సాధారణంగా తీసుకున్న తల్లి.. తర్వాత బాలికకు తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆందోళన చెందింది. మూడు రోజులపాటు సాత్విక పాఠశాలకు వెళ్లలేకపోయింది. తల్లిదండ్రులు ఆమెను స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు బెంగళూరు తీసుకెళ్లమని సూచించారు.
దీంతో బెంగళూరుకి వెళ్లి అక్కడి ఆసుపత్రిలో పరీక్షలు చేయగా.. బాలిక పుర్రె ఎముక చిట్లినట్లు తేలింది. ఈ గాయం తీవ్రమైనదని, ఆపరేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సాత్విక బెంగళూరులో చికిత్స పొందుతోంది. కానీ పూర్తిగా కోలుకోవడానికి టైమ్ పడుతోందని చెప్పారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన బాలిక తల్లి, బంధువులు పుంగనూరు పోలీస్ స్టేషన్లో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో టీచర్ చట్టవిరుద్ధంగా శారీరక శిక్ష అమలు చేయడం, విద్యార్థినికి గాయం అయ్యేలా చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పుంగనూరు ప్రాంతంలోని తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook