
Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై వెళుతున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఏడుగురు మరణించారు. రాంగ్ రూట్లో వచ్చి మరీ టిప్పర్ కారును ఢీకొట్టింది.
టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే కారు నెల్లూరు నుంచి బద్వేలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. ఇక ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్ కావడంతో.. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
అయితే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులు నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్ గుర్రం వారి వీధికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు తాళ్లూరి రాధ, తాళ్లూరి శ్రీనివాసులు, శేషం తేజ, శేషం సారమ్మ, నల్లగొండ లక్ష్మీ. మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలు నుజ్జునుజ్జవ్వడంతో పోలీసులకు బయటకు తీయడానికి కొంచెం ఇబ్బందిగా మారింది.
అయితే ఈ ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని.. ఈ విషయం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు జగన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook