Bengaluru Crime News: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఓ మహిళను చంపి 19 ముక్కలుగా నరికి ఘటన షాక్‌కు గురిచేస్తుంది. ఇప్పటికే ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఓ డెంటిస్ట్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ దారుణ హత్యను ఆమె సొంత అల్లుడు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
బెల్లావి గ్రామానికి చెందిన బాధితురాలు లక్ష్మీ దేవి (42), ఆగస్టు 4న తన కుమార్తెను చూడటానికి ఇంటి నుండి బయలుదేరింది. అయితే ఆ తర్వాత రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆమె భర్త బసవరాజ్ బెల్లావి పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ నివేదించింది.
కొన్ని రోజుల తర్వాత అంటే ఆగస్టు 7న చింపుగనహళ్లిలో చెల్లాచెదురుగా ఉన్న అనుమానాస్పద సంచులను నివేదిస్తూ పోలీసులకు అనేక కాల్స్ వచ్చాయి. లోపల మొత్తం 19 మానవ శరీర భాగాలు 19 వేర్వేరు ప్రదేశాలలో వదిలేశారు. ఫోరెన్సిక్ బృందాలు, పోలీసు సిబ్బంది భయంకరమైన జాడను సేకరించడం ప్రారంభించారు.
దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం బాధితురాలి అల్లుడు, దంతవైద్యుడు డాక్టర్ రామచంద్రయ్య ఎస్ (47), సతీష్ కె ఎన్ (38), కిరణ్ కె ఎస్ (32) లను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ కల్లహళ్లి నివాసితులు.
తుమకూరు ఎస్పీ అశోక్ చెప్పిన వివరాల ప్రకారం.. మృతదేహ భాగాలను పారవేయడానికి మారుతి సుజుకి బ్రెజ్జాను ఉపయోగించినట్లు చూపించే సిసిటివి ఫుటేజ్ కీలక ఆధారమైంది. కారు సతీష్ పేరు మీద రిజిస్టర్ చేయబడింది. అదుపులోకి తీసుకున్న తర్వాత, సతీష్ ఆ నేరాన్ని ఒప్పుకున్నాడు. కిరణ్, డాక్టర్ రామచంద్రయ్య ఇద్దరినీ ఇరికించాడని నివేదిక ద్వారా తెలిసింది.
2019 నుండి లక్ష్మీ దేవి కుమార్తె తేజస్విని వివాహం చేసుకున్న డాక్టర్ రామచంద్రయ్య.. అతని అత్త తమ వివాహ సమస్యలలో జోక్యం చేసుకోవడం పట్ల కలత చెందాడని సమాచారం. తన భార్యను ప్రభావితం చేసి ఇంట్లో విభేదాలు సృష్టించినందుకు అతను ఆమెను నిందించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతని పెళ్లి ఇంకా విడాకుల ప్రక్రియలో ఉందని అధికారులు తెలిపారు. అయితే ఆ మహిళను చంపి ముక్కులుముక్కలుగా ఎందుకు నరకాల్సి వచ్చిందనేది తెలియరాలేదు. అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించడం సహా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసుల ఛేదించే ప్రక్రియలో ఉన్నామని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు.
Also Read: War 2 Pre-Release: ఆ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవ్వడూ ఆపలేడు: Jr. ఎన్టీఆర్
Also Read: Oppo K13: 7,000mAh బ్యాటరీతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన OPPO!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









