)
Doctors Negligence In Warangal Mgm Hospital: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఓ పాజిటివ్‌కు బదులుగా బీ పాజిటివ్ రక్తం ఎక్కించడంతో ఓ మహిళ ప్రాణాపాయంలో పడింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం నుంచి వచ్చిన ఇలాసాగరం జ్యోతి అనే 34 ఏళ్ల మహిళ.. ఈ నెల 16న తీవ్ర జ్వరం మరియు శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరింది.
డాక్టర్లు పేషెంట్‌కు రక్తం తక్కువగా ఉందని చెప్పి నమూనాలు తీసుకుని పరీక్షించారు. వారు బీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌గా నిర్ధారించారు. కానీ సదరు మహిళా పేషెంట్.. తన బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని చెప్పినా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఆమెకు బీ పాజిటివ్ రక్తాన్ని కూడా ఎక్కించారు. అంతేకాకుండా మరుసటి రోజు కూడా అదే రక్తాన్ని మరోసారి ఎక్కించారు.
దీంతో బాధితురాలికి వాంతులు, విరేచనాలే కాకుండా ఒంటిపై దద్దుర్లు కూడా వచ్చాయి. భయపడిన కుటుంబ సభ్యులు డాక్టర్లకు చెప్పగా.. మళ్లీ పరీక్షలు చేసి ఆమె బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్‌గా తేల్చారు. అయితే ఈ ఘటన బయటకు రాకుండా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స చేయడం మొదలుపెట్టారు.
సిబ్బంది నిర్లక్ష్యం వహించడం, బ్లడ్ బ్యాంకులో పరీక్షల్లో లోపాలపై రోగులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ని ప్రశ్నించగా.. హార్మోన్ల సమస్య వల్ల రక్తం మారే అవకాశం ఉందని, ఇందులో తమ తప్పేమి లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిర్లక్ష్యంగా పనిచేసిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.