)
CEO among three held for gang rape of woman in Udaipur: రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఐటీ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతి గ్యాంగ్‌రేప్‌కు గురైంది. ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి యువతిని కారులో ఎక్కించుకున్న నిందితులు.. కదులుతున్న కారులోనే సదరు యువతిపై సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఇదంతా కారులోని వెబ్‌క్యామ్‌లో రికార్డు అయింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే, యువతిపై అత్యాచారంకు పాల్పడింది.. తాను పనిచేస్తున్న సంస్థ సీఈవోతోపాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో JKM అనే ఐటీ కంపెనీ సీఈవో జీతేశ్ సిపోడియా తన పుట్టిన రోజు, న్యూఇయర్‌కు సంబంధించి ఈ నెల 20వ తేదీన ఓ హోటల్లో పార్టీ అరెంజ్ చేశాడు. ఆ కంపెనీకి చెందిన మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహి ఆహ్వానించడంతో.. బాధితురాలు కూడా ఆ పార్టీకి అటెండ్ అయింది. రాత్రి ఒంటి గంట సమయంలో ఆమెకు కాస్త అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. అయితే ఇంత రాత్రి ఒక్కదానివే ఎలా వెళ్తావు.. నిన్ను మీ ఇంటి వద్ద దింపుతానంటూ శిల్పా సిరోహి బాధిత యువతిని కారులో ఎక్కించుకుంది. అప్పటికే ఆ కారులో శిల్ప భర్త గౌరవ్, సంస్థ సీఈవో జీతేశ్ ఉన్నారు.
ఇక కాస్త దూరం వెళ్లగానే శిల్ప సిరోహి కారును ఆపేసింది. కారులో నుంచి అందరూ కిందికి దిగారు. ముగ్గురూ పొగపీల్చే పదార్థాలను తీసుకున్నారు. అక్కడే ఉన్న బాధిత యువతితోనూ బలవంతంగా మత్తు పదార్థంతో కూడిన ఆ పొగను పీల్చేలా చేశారు. ఆ తరువాత మళ్లీ అక్కడి నుండి వారు కారులో బయలుదేరారు. మత్తుతో కూడిన పొగను పీల్చడంతో బాధిత యువతి కారులో స్పహ కోల్పోయింది. దీంతో జితేశ్‌తో పాటు గౌరవ్ ఆమెపై లైంగికదాడికి యత్నించారు. బాధిత యువతి మత్తు నుంచి తేరుకోగా.. తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని గ్రహించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది.
బాధిత యువతి జరిగిన ఘటపైపోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘోరానికి సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. అయితే, కారులోని వెబ్‌క్యామ్‌లో నిందితులు పాల్పడిన దారుణానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ పుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యువతిపై దారుణానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి