Thiruvananthapuram crime: కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో ఉన్న వెంజరమూడు అనే గ్రామంలో కుటుంబ సభ్యులందరినీ కిరాతకంగా హత్య చేశాడు 23 ఏళ్ల యువకుడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకోవడంతో ఈ విషయం కాస్త కలకలం సృష్టిస్తోంది. పోలీస్ స్టేషన్ కి వచ్చిన అతడు తాను ఆరుగురిని హత్య చేసినట్లు చెప్పి సరెండర్ అయ్యారు.
అఫాన్ అనే 23 ఏళ్ల యువకుడు కుటుంబ సభ్యులందరినీ చంపి, తాను కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశానని తెలిపారు. తమ్ముడు, అమ్మమ్మ, అత్త, మామ, ప్రియురాలిని హత్య చేశానని ఆ యువకుడు చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇక నిందితుడు తల్లిపై కూడా దాడి చేయగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నిందితుడి తల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అఫాన్ అనే వ్యక్తిపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబ సభ్యులను హతమార్చడం ఏంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఒక మనిషిని చంపడం ఏంటి? నువ్వు మనిషివా? మృగానివా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
పోలీసులను ఆశ్రయించిన నిందితుడు పోలీసులతో పూర్తి వివరాలు తెలియజేసినట్లు సమాచారం .ఇక పోలీసులు ఇప్పటివరకు ఐదు మరణాలను నిర్ధారించారు. సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలోనే మూడు వేరువేరు ప్రదేశాలలో ఈ హత్యలు జరిగాయట.
నిందితుడు అఫాన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయి సంఘటనల క్రమాన్ని వివరించిన తర్వాత ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల సోదరుడు అహసన్, అమ్మమ్మ సల్మాబీవీ, మామ లతీఫ్, అత్త షాహిహా, గర్ల్ ఫ్రెండ్ ఫర్శానా లను తాను హత్య చేసినట్లు చెప్పగా వారందరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . ఇక ప్రస్తుతం నిందితుడు తల్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.
ముఖ్యంగా తాను విషం సేవించానని పోలీసులకు సమాచారం అందించాడు నిందితుడు. దీని తర్వాత అతడిని చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇన్ని హత్యలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సామూహిక హత్యలపై పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు.
Also read: Earthquake Hit: బంగాళాఖాతంలో భారీ భూకంపం, సునామీ వచ్చే ప్రమాదముందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









