Uttar Pradesh Crime News: ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘోరం సంఘటన జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి కోపంలో తన నలుగురు పిల్లల గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా భార్య చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అతను మానసికంగా బాధపడుతున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వెలుగులోకి వస్తోంది. పిల్లలంతా 13 నుంచి 5 ఏళ్ల లోపు వారే కాగా.. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
రోజా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మాన్పూర్ చాచారి గ్రామంలో రాజీవ్ కథేరియా (36) అనే వ్యక్తి తన భార్య కాంతి దేవి, కుమార్తెలు స్మృతి (13), కీర్తి (9), ప్రగతి (7), కుమారుడు రిషబ్ (5)లతో కలిసి నివసిస్తున్నాడు. కాంతి దేవి బుధవారం కరటోలి గ్రామంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. రాజీవ్, నలుగురు పిల్లలు ఇంట్లో ఉన్నారు. రాజీవ్ ఇంటి పక్కనే నివసించే అతని తండ్రి పృథ్వీరాజ్ గురువారం ఉదయం తన మనవడిని టీ కోసం పిలిచాడు. కానీ లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు.
చాలా సేపు పిలిచినా ఇంటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో పైకప్పు ఎక్కి మెట్ల గుండా ఇంటి లోపలికి తొంగి చూశాడు. లోపల దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయి ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టాడు. నలుగురు పిల్లల గొంతులు కోసి ఉండగా.. రాజీవ్ చీరకు ఉరివేసుకుని వేలాడుతూ ఉన్నాడు. స్థానికులు వెంటనే అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న ఎస్పీ రాజేష్ ద్వివేది పోలీసుతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడాది క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రాజీవ్ తలకు తీవ్ర గాయమైందని.. చికిత్స పొందుతున్నాడని తండ్రి పృథ్వీ రాజ్ వెల్లడించారు. ఆ గాయం అతన్ని ఆందోళనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటన వెనుక గల కారణం ఇంకా నిర్ధారించలేదని పోలీసులు తెలిపారు. రాజీవ్ తన పిల్లలను చంపడానికి ముందు ఆయుధానికి పదును పెట్టడానికి ఇసుక అట్టను ఉపయోగించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. సంఘటన స్థలం నుంచి ఆయుధంతోపాటు ఇసుక అట్టను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Viral Video: భార్య దగ్గరుండి.. ప్రియుడితో ఆ పనిచేయించిన భర్త.. వీడియో వైరల్..
Also Read: Ys Jagan: సనాతని, చంద్రబాబును ఏకిపారేసిన వైఎస్ జగన్, ఏమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









