Husband And Wife Matters: పెళ్లాం ఊరెళ్లి తిరిగి రావడం లేదనే కోపంతో తన పురుషాంగాన్ని తనే...
Husband And Wife Matters: కృష్ణ బసుకి బతుకుదెరువు కోసం పంజాబ్ మండిలో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. అతడి భార్య అనిత నలుగురు పిల్లలతో కలిసి అత్తింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం కృష్ణ బసుకి తన కుటుంబాన్ని చూసిపోయేందుకని ఇంటికి వచ్చాడు. కృష్ణ బసుకికి అప్పుడే తెలిసింది ఏంటంటే.. తన భార్య అనిత ఇంట్లో లేదు.. పుట్టింటింకి వెళ్లిందని.
Husband And Wife Matters : పుట్టింటికి వెళ్లిన భార్య నెలలయినా వెనక్కి తిరిగి రావడం లేదనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన పురుషాంగాన్ని తనే కత్తితో కోసేసుకున్న ఘటన ఇది. ఇండియా టుడే ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం బిహార్లోని మధెపుర పోలీసు స్టేషన్ పరిధిలోని రజ్ని నయానగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణ బసుకికి అనిత అనే యువతితో పెళ్లి అయింది. వీరి వివాహ బంధానికి తీపి గుర్తుగా ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
కృష్ణ బసుకి బతుకుదెరువు కోసం పంజాబ్ మండిలో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. అతడి భార్య అనిత నలుగురు పిల్లలతో కలిసి అత్తింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం కృష్ణ బసుకి తన కుటుంబాన్ని చూసిపోయేందుకని ఇంటికి వచ్చాడు. కృష్ణ బసుకికి అప్పుడే తెలిసింది ఏంటంటే.. తన భార్య అనిత ఇంట్లో లేదు.. పుట్టింటింకి వెళ్లిందని. ఇదే విషయమై తన తల్లిదండ్రులను అడగ్గా.. పుట్టింటికి వెళ్లిన కోడలు అనిత ఇంకా తిరిగి రాలేదు అని చెప్పారు.
పుట్టింటికి వెళ్లిన భార్య ఇంకా తిరిగి రాకపోవడాన్ని తనకు భరించలేని అవమానంగా భావించిన కృష్ణ బసుకి ఆమెపై తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. భార్యపై ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన కృష్ణ బసుకి.. ఆమెపై కోపంతో పదునైన కత్తి లాంటి ఆయుధం తీసుకుని తన పురుషాంగాన్ని తనే కత్తిరించుకున్నాడు.
తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణ బసుకిని చూసిన అతడి బంధువులు.. హటాహుటిన అతడిని మెడికల్ కాలేజీ హాస్పిటల్కి తరలించారు. అతడికి చికిత్స చేసిన డాక్టర్ సుఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణకు చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పిందని అన్నారు. కృష్ణ బసుకి గురించి తెలిసిన వారు మాట్లాడుతూ.. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిపారు. అందువల్లే పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదనే కోపంలో తనేం చేస్తున్నాడో తెలియకుండానే ఈ దారుణానికి పాల్పడ్డాడని వారు పేర్కొన్నారు.