)
Pahalgam Terror Attack: భారత్ పాకిస్థాన్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో వివిధ పనులపై వచ్చిన పాకిస్థాన్ వాసులు రెండు రోజుల్లో దేశం విడిచివెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24న కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అందులో ఏప్రిల్ 27న అందరు దేశం విడిచివెళ్లాని చెప్పింది. ఇక మెడికల్ వీసాలపై వచ్చిన పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 29 నాటికి భారతదేశాన్ని విడిచిపెట్టాలని అల్టీమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. దౌత్య, అధికారిక , దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని 'లీవ్ ఇండియా' నోటీసు నుండి మినహాయించారు. పాకిస్తానీయులకు 12 వర్గాలలో దేనినైనా స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్న గడువు ఆదివారం ముగిసింది.
పహల్గామ్ లో ఉగ్రవాదులు.. ముందుగా హిందువులను, ముస్లిమ్స్ ను వేరు చేసి అందులో 26 పురుషులను చంపింది. అందులో 24 మంది హిందువులు.. ఒకరు క్రిష్టియన్ కాగా.. మరొకరు ముస్లిమ్. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ తో ఉన్న అన్ని దౌత్యపరమైన సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాటు పాక్ దేశంతో ఉన్న అన్ని ట్రేడ్ అగ్రిమెంట్ లను రద్దు చేసింది. అంతేకాదు భారత్ గగన తలం నుంచి పాకిస్థాన్ విమానాల రాకపోకలను నిషేధించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు మన దేశ సముద్రతీరంలో పాకిస్థాన్ నౌకలకు షెల్టర్ ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వీసాపై వెళ్లిన భారతీయులు వెంటనే మన దేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. మరోవైపు మన దేశంలో ఉంటున్న పాక్ జాతీయులు రెండు మూడు రోజుల వ్యవధిలో వెళ్లిపోవాలన్నారు. లేకపోతే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్ాన్ నేషనల్స్ పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏప్రిల్ 29 తర్వాత భారతదేశంలోనివాసం ఉంటే వారిని ఇల్లీగల్ గా పరిగణించి వారినీ తరలిస్తామన్నారు. ఇప్పటికే మన దేశం నుంచి అట్టారీ .. పాక్ వాఘా సరిహద్దు వద్ద 786 మంది పాక్ జాతీయులు వారి దేశంలో విడిచిపెట్టారు. త్వరలో మిగతా వారిని ఏరివేసే పనిలో ప్రభుత్వం పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe