)
Pregnant Bengaluru Techie Found Hanging: వరకట్న వేధింపులతో ఇటీవలే యూపీలోని నోయిడాలో ఓ గర్భిణిని.. అత్తింటివాళ్లు నిప్పటించి, హత్య చేసిన దారుణ ఘటన మరవకముందే.. బెంగళూరులో అధిక కట్నం కోసం మరో గర్భిణీ బలైంది. శిల్ప అనే టెకీ అనుమానస్పద స్థితిలో ఉరి వేసుకొని.. తన నిండు నూరేళ్ల జీవితాన్ని అద్దంతరంగా ముగించింది.
బెంగళూరులో టెకీగా పనిచేస్తున్న శిల్ప అనే 27 ఏళ్ల గర్భిణి అనుమానాస్పదంగా మరణించింది. అయితే శిల్ప 5 నెలల గర్భిణి. మూడేళ్ల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. వారికి ఒక ఏడాదిన్నర వయసు గల పాప కూడా ఉంది. శిల్ప ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్లు కనిపించింది. కానీ ఆమె తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదని, అత్తింటివారు కట్నం కోసం ఆమెను హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.
పెళ్లి సమయంలో ప్రవీణ్ కుటుంబం భారీ కట్నం అడిగింది. 15 లక్షల రూపాయల నగదు, 150 గ్రాముల బంగారం, ఇతర వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శిల్ప కుటుంబం ఈ డిమాండ్లను నెరవేర్చి, ఇంటిని అమ్మి 40 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అడిగిన దానికంటే 10 గ్రాముల ఎక్కువ బంగారం కూడా ఇచ్చారు. అయినా పెళ్లి తర్వాత అత్తింటివారు మరింత కట్నం కోసం శిల్పను వేధించారని ఆమె కుటుంబం చెబుతోంది.
ప్రవీణ్ తమతో బీఈ, ఎంటెక్ చదివినట్లు చెప్పాడని.. కానీ గత రెండేళ్లుగా అతను పానీపూరీ అమ్ముతున్నాడని శిల్ప కుటుంబం తెలిపింది. శిల్ప మరణంపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. శిల్ప
ఉరివేసుకున్న గదిలో కుర్చీ లేదు, ఫ్యాన్ చాలా ఎత్తులో ఉంది, తలుపు విరిగిన ఆనవాళ్లు కూడా లేవని చెప్పారు. ఇది హత్య అని, ఆత్మహత్యలా చిత్రీకరిస్తున్నారని శిల్ప కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై శిల్ప కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook