)
Tragic Incident In Suryapet District: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కన్నతండ్రే రాక్షసంగా మారిన దారుణమైన ఘటన జరిగింది. ఓ కసాయి తండ్రి మద్యం మత్తులో తన 12 నెలల చిన్నారిని కనికరం లేకుండా.. కాళ్లు పట్టుకొని నేలకేసి విసిరికొట్టాడు. దీంతో ఆ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ పాప కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
నాగారం మండలం డి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, నాగమణి దంపతులకు కూతురు భవిజ్ఞ ఉంది. వీరు సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాత్రి వెంకటేశ్వర్లు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. వారి గొడవ వల్ల చిన్నారి భవిజ్ఞ భయపడి ఏడవడం మొదలుపెట్టింది.
మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు కోపంతో చిన్నారి కాళ్లు పట్టుకొని నేలకు కొట్టాడు. దీంతో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తలకు మరియు శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
భర్త చేతిలో తన చిన్నారి మృత్యువాతపడటాన్ని తల్లి నాగమణి తట్టుకోలేక గుండెలదిరేలా రోధిస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో మానవత్వాన్ని మరిచి జరిగిన ఈ దారుణంపై.. సంఘీభావంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook