Takes Thumb of Dead Woman: ఆస్తి కోసం కక్కుర్తి.. చనిపోయిన వృద్ధురాలి నుంచి వేలిముద్రలు.. నెట్టింట వీడియో వైరల్

Thumb Impression from Dead Woman: సమాజంలో రోజురోజుకు మానవసంబంధాలు దిగజారిపోతున్నాయి. ఆస్తి మైకంలో పడి మానవత్వం లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారు. అగ్రాలో వీలునామా కోసం చనిపోయిన వృద్ధురాలి నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 12:19 PM IST
Takes Thumb of Dead Woman: ఆస్తి కోసం కక్కుర్తి.. చనిపోయిన వృద్ధురాలి నుంచి వేలిముద్రలు.. నెట్టింట వీడియో వైరల్

Takes Thumb Impression of Dead Woman on Property : ఉత్తరప్రదేశ్‌లో అవమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం మరణించిన మహిళ నుంచి వేలి ముద్రలు తీసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తప్పుడు వీలునామా కోసం వేలిముద్రలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే ఈ వీడియో 2021 నాటిదని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇలా..

సెవ్లా ప్రాంతానికి చెందిన సర్వన్ లాల్, కమలా దేవి భార్యాభర్తలు. గతంలోనే సర్వన్ లాల్ మరణించగా.. ఆమె నైనానా జాట్‌లో నివసిస్తోంది. వీరికి పిల్లలు లేరు. ఆమె ఆరోగ్యం క్షీణించగా.. కమలాదేవి దగ్గరి బంధువులు ఆసుపత్రి కోసం అని కారులో తీసుకెళ్లారు. ఆ తరువాత ఆమె చనిపోయిందని బంధువులు అందరికీ ఫోన్ చేసి చెప్పారు. ఆస్తి కోసం నకిలీ వేలి ముద్రలు తీసుకున్నారని అప్పుడు ఎవరూ గుర్తించలేకపోయారు. ఆమె చనిపోయిన తరువాత వెనుక సీట్లో మృతదేహం ఉండగా.. న్యాయవాదిని పిలిపించి వేలిముద్రలు తీసుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది. 

తాజాగా వీడియోను చూసిన కమలా దేవి బంధువులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కమలాదేవి సంతకం పెడతారని.. వేలి ముద్రలు వేయరని పోలీసులకు చెప్పారు. ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు వీలునామా సృష్టించి ఆమె ఆస్తులు, దుకాణాన్ని తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 45 సెకెండ్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

Also Read: DC Vs MI Highlights: హైఓల్టెజ్ మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌ విక్టరీ.. ఢిల్లీకి నాలుగో ఓటమి

మృతురాలు కమలాదేవి భర్త సర్వన్‌లాల్‌కు ఆరుగురు సోదరులు ఉన్నారని సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నీరజ్ కుమార్ శర్మ వెల్లడించారు. తమకు పిల్లలు లేకపోవడంతో తమ ఆస్తిని అంతా 2018లో సర్వన్ లాల్ కమలా దేవి సొసైటీకి వీలునామా చేశాడు. అతని మూడో సోదరుడు తంసింగ్‌కు ముగ్గురు కుమార్తెలు. ఇందులో ఓ కూతురు కొడుకు జితేంద్ర ఆస్తిని కబ్జా చేశాడని ఆరోపిస్తున్నారు. కమలాదేవి పేరుపై ఇల్లు మాత్రమే మిగిలి ఉండగా.. దీనిపై వివాదం నడుస్తోంది. 

Also Read: Karnataka Elections: రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ఎన్నికల్లో మాజీ సీఎం విచిత్ర హామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News