Cyber Fraud: మామూలు స్కామ్ కాదు.. 24 రూపాయల రిఫండ్ కోసం ఏకంగా రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ.. అసలేం జరిగిందంటే..?

Ahmedabad cyber crime: ఆన్‌లైన్‌లో జరిగే సైబర్ నేరాల గురించి పోలీసులు నిత్యం ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే లింక్ లను ప్రెస్ చేయొద్దని, జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇంత చేస్తున్న కొందరిలో మాత్రం కొంచెం కూడా మార్పు రావడం లేదు. సైబర్ మోసాలకు అడ్డంగా బుక్కై, డబ్బులు పొగొట్టుకుంటున్నారు. తాజాగా 24 రూపాయల రీఫండ్ కోసం ఓ మహిళ ఏకంగా 87వేల రూపాయలు పొగొట్టుకుంది.  

Written by - Aruna Maharaju | Last Updated : Dec 8, 2025, 12:28 PM IST
Cyber Fraud: మామూలు స్కామ్ కాదు.. 24 రూపాయల రిఫండ్ కోసం ఏకంగా రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ.. అసలేం జరిగిందంటే..?

Woman Loses 87k In Cyber Fraud: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన సదరు మహిళ.. రీఫండ్ కోసం ఆన్‌లైన్‌లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆ మహిళకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపారు. దాని ద్వారా బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87 వేలు కొట్టేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

అహ్మదాబాద్‌కి చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో ద్వారా వంకాయలు ఆర్డర్ చేసింది. అందుకోసం 24 రూపాయలు చెల్లించింది. అయితే ఆమె సెలెక్ట్ చేసుకున్న వంకాయలకు బదులుగా వేరే వంకాయలు వచ్చాయి. దీంత ఆ మహిళ వాటిని తిరిగి ఇవ్వడానికి డెలివరీ బాయ్‌ని సంప్రదించగా అతడు నిరాకరించాడు. కస్టమర్ కేర్ కి కాల్ చేయాలని చెప్పాడు.

అయితే..డెలివరీ బాయ్ దగ్గర కస్టమర్ కేర్ నంబర్ లేకపోవడంతో సదరు మహిళ ఆన్‌లైన్‌లో చెక్ చేయగా.. అక్కడ ఒక నెంబర్ కనిపించింది. దీంతో ఆ నంబర్ కు కాల్ చేయగా లిఫ్ట్ చేసిన ఓ వ్యక్తి ఆమెకు మరో నెంబర్ ఇచ్చి ఫిర్యాదు చేయడానికి కాల్ చేయమని అడిగాడు. అతడు చెప్పినట్లే ఆ మహిళ కాల్ చేసింది. అవసరమైన సమాచారం కోసం వాట్సాప్ కాల్ వస్తుందని ఆ మహిళతో చెప్పాడు. అన్నట్లే ఆమెకు కాల్ వచ్చింది. అతడు ఏదో సమాచారం అడగగా.. ఆమె ఆ సమాచారం ఇచ్చింది. తర్వాత వాట్సాప్‌లో కాల్ చేసిన వ్యక్తి ఆమెకు రీఫండ్ ప్రాసెస్ చేయబడిందని, త్వరలో జనరేట్ అవుతుందని హామీ ఇచ్చాడు. రీఫండ్ తనిఖీ చేయడానికి కాలర్ ఆమెకు లింక్‌ను కూడా పంపాడు.

దీంతో ఆ మహిళ ఆ లింక్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా.. అది ఆమె బ్యాంక్ అకౌంట్ వివరాలను అడిగింది. వివరాలు ఎంటర్ చేసిన  తర్వాత.. ఆ మహిళ తన UPI పాస్‌వర్డ్‌తో రీఫండ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి ప్రయత్నించింది. రీఫండ్ జనరేట్ కాకపోవడంతో ఆమె మళ్లీ అదే నంబర్‌కు కాల్ చేసింది. దాంతో అతడు.. ఇతర అకౌంట్స్ బ్యాలెన్స్‌ను కూడా చెక్ చేయమని చెప్పాడు. వాళ్లు చెప్పినట్లు ఆమె తన ఇతర బ్యాంకు అకౌంట్స్ లో తనిఖీ చేసింది. ఇక అంతే.. వేర్వేరు అకౌంట్ల నుంచి మొత్తం 87 వేల రూపాయలు కట్ అయ్యాయి. దాంతో సదరు మహిళ తాను మోసపోయాయని తెలుసుకొని షాక్ కి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: Pawan Kalyan: కర్ణాటక గడ్డపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం.. ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం..!

Also Read: Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News