)
Woman suicide attempt over tv serial issue in mahabubabad: ఇటీవల కొంత మంది భార్యభర్తల్ని చూస్తే మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేయాల్సింది పోయి ఒకర్ని మరోకరు ఎలా చంపాలో ప్లాన్ లు చేసుకుంటున్నారు. మొత్తంగా భార్యభర్తలు ఒకర్ని మించి మరోకరు ప్లాన్ లు చేస్తున్నారు. దీంతో ప్రతిరోజు కూడా భార్యభర్తల హత్యలు, ఆత్మహత్యలకు చెందిన ఘటనలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
కొంత మంది క్షణికావేశంలో అసలు వాళ్లు ఏంచేస్తున్నారో కూడా ఆలోచించుకొలేని సిట్యువేషన్ కు వెళ్లిపోయారు.ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుండి పొలం పనులు చేసి భర్త ఇంటికి వచ్చాడు.
కుటుంబంలో చిచ్చు పెట్టిన టీవీ సీరియల్
సీరియల్ ముఖ్యమా, నేను ముఖ్యమా అని భర్త కోప్పడినందుకు కొడుకుకు పురుగుల మందు తాగించి, తానూ తాగిన భార్య
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో ఘటన
ఉదయం నుండి పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా, సీరియల్ అయిపోయాక… pic.twitter.com/orjc4kIv1s
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2025
అయితే.. అతను అన్నం పెట్టమని సీరియల్ చూస్తున్న భార్యను అడిగాడు. దీంతో భార్య సీరియల్ అయిపోయాక పెడతానని చెప్పింది. కానీ అతను మాత్రం.. సీరియల్ ముఖ్యమా, నేను ముఖ్యమా అని భర్త కోప్పడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో భర్తతో గొడవ పడింది.
ఈ క్రమంలో భర్త ఇంటి వెనకాల వెళ్లి రాత్రిపూట కూర్చున్నాడు. రాత్రి పూట ఆమె పురుగుల మందు తాగి, తన కొడుకుకు తాగించింది. దీంతో ఇంట్లో పెద్ద శబ్దమైంది. వెంటనే భర్త వచ్చి చూడగా.. భార్య మరోకూతురుకు సైతం పురుగులు మందు తాగించడానికి ప్రయత్నించింది.
వెంటనే భర్త ఆమె చేతి నుంచి పురుగుల మందు బైటపడేశాడు. చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. ఇద్దర్ని కూడా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. మరో వైపు అతని భార్యకు ప్రాణాపాయం తప్పింది.
మొత్తంగా తన భార్యను తాను అన్నం పెట్టమన్నందుకు, సీరియల్ ముఖ్యమా.. తాను ముఖ్యమా..అని అడినందుకు ఇంత ఘోరం చేసిందని భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. భర్త ఈ ఘటనపై మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు మరీ ఇలా తయారయ్యారెంట్రా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి