)
12A Railway Colony Review: అల్లరి నరేష్ హీరోగా కామాక్షి హీరోయిన్ గా సాయి కుమార్ మరో ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘12A రైల్వే కాలనీ’. నాని కాసరగడ్డ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
12A రైల్వే కాలనీ స్టోరీ విషయానికొస్తే.. కార్తీక్ (అల్లరి నరేష్ ) అతని తొట్టి గ్యాంగ్.. ఓ పొలిటికల్ లీడర్ గా దగ్గర పనిచేస్తూ ఈ క్రమంలో ఈ ఊరిలో ఉండే హీరోయిన్ (కామాక్షి)ని చూసి లవ్ లో పడతాడు. ఈ క్రమంలో కామాక్షితో పాటు వాళ్ల అమ్మను ఎవరో మర్డర్ చేస్తారు. ఈ క్రమంలో తన లవర్ తో పాటు వాళ్ల అమ్మను చంపిన వాళ్లను ఎవరు చంపారనేదానిపై ఇన్వెస్టిగేట్ మొదలు పెడతాడు హీరో. ఈ క్రమంలో అతనికో భయంకరమైన నిజం తెలుస్తుంది. చివరకు ఏం జరిగిందనేదే ‘12A రైల్వే కాలనీ’ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
పొలిమేర, పొలిమేర 2 వంటి సినిమాలను నిర్మించిన మేకర్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో 12A రైల్వే కాలనీ పై అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడంలో విజయం సాధించాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ హీరో అతని గ్యాంగ్ ఓ పొలిటికల్ లీర్ కోసం చేసే పనులు.. హీరోయిన్ తో ప్రేమలో పడటం.. ఆమె మర్డర్ చుట్టే తిరగడం ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. అయితే అల్లరి నరేష్ వంటి హీరోతో మంచి సబ్జెక్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో తెరకెక్కించిన ప్రేక్షకులకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తోంది. హీరోయిన్ మర్డర్ తో సెకండాఫ్ తర్వాత ఏం జరుగుతుందనే అంశంపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ ను చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాడు. వచ్చిన సీన్సే మళ్లీ మళ్లీ రావడం బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్ ఉన్నంత వరకు బెటర్ గా అనిపిస్తుంది. ఒక క్లైమాక్స్ కోసం సినిమా మొత్తం తీసినట్టు ఉంది. దర్శకుడు నాని మేకింగ్ స్టైల్ మెప్పిస్తోంది. అల్లరినరేష్ కామెడీ సినిమాలు చేసినపుడు కొన్ని వెరైటీ కథలు చేశాడు. ఢిఫరెంట్ సబ్జెక్ట్ అంటూ చేస్తున్న సినిమాలు అతనికి సరైన హిట్ అందించలేకపోతున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు.
నటీనటుల విషయానికొస్తే..
అల్లరి నరేష్.. తన పరిధి మేరకు బాగానే చేశాడు. కొన్ని సీన్స్ లో అతని నటనను మెచ్చుకోకుండా ఉండలేము. ఇంకోవైపు కథానాయికగా నటించిన కామాక్షి పర్వాలేదు. సాయికుమార్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
పంచ్ లైన్.. కాస్త భయపెడుతూ థ్రిల్ కు గురిచేసే ‘12 A రైల్వే కాలనీ’
రేటింగ్: 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.