97th Oscars 2025 Updates: యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబువరం ఎంతో వైభవంగా షురూ అయ్యింద. దీనిలో భాగంగా పలు విభాగాలకు గాను పురస్కారాలను అందించారు అకాడమీ సభ్యులు. ఇక ఎ రియల్ పెయిన్ మూవీలో తన నటనకు గాను కీరన్ కైల్ కల్కిన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక వికెడ్ మూవీకి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పాల్ తేజ్ వెల్ ను ఆస్కార్ వరించింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఇన్ ది షాడ్ ఆఫ్ ది సైప్రెస్ ఈ అవార్డును అందుకుంది.
97వ అకెడమీ అవార్డుల కోసం వైవిధ్యమైన చిత్రాలు ఎంపిక అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీనటులు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్కార్ అవార్డుల వేడుకకు వచ్చిన గెస్టుల్లో నటి వ్యాఖ్యత అమేలియా డిమోల్డెన్ బర్గ్ చిట్ చాట్ చేశారు. 97వ అకాడెమీ అవార్డుల వేడుకను ఏబీసీ, జియో హాట్ స్టార్, స్టార్ మూవీస్ , హులు, యూట్యూబ్ టీవీ, ఫుబోటీవీ, ఏటీ అండ్ టీ టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్, లెసా, క్వీన్ లతీఫా, రేయ్ లు తమ ప్రదర్శనతో ఆహుతులను ఆకట్టుకున్నారు.
Lisa performs “Live and Let Die” at #Oscars2025 pic.twitter.com/dVv0EATBml
— All Time Entertainment (@AllTimeEnt) March 3, 2025
ఆస్కార్ అవార్డులు
ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్ సినిమాలో)
బెస్ట్ యానిమేటెడ్ మూవీ - ఫ్లో
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - పాల్ తాజ్‌వెల్ (వికెడ్ సినిమాలో)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - సీన్ బేకర్ (అనోరా సినిమాలో)
బెస్ట్ మేకప్, హెయిర్ స్టైల్ - ది సబ్‌స్టాన్స్
ఉత్తమ సహాయ నటి - జోయ్ సల్దానా (ఎమిలియా పెరెజ్)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









