45: ముగ్గురు సౌత్ సూపర్ స్టార్ లో ప్రధాన పాత్రలో 45.. ఘనంగా టీజర్ విడుదల..

45 Pan India Movie: శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ "45" టీజర్ హైదరాబాద్‌లో విడుదలైంది. అర్జున్ జన్యా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.  

Written by - Vishnupriya | Last Updated : Apr 16, 2025, 10:03 AM IST
45: ముగ్గురు సౌత్ సూపర్ స్టార్ లో ప్రధాన పాత్రలో 45.. ఘనంగా టీజర్ విడుదల..

Upendra New Movie: శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 45 టీజర్ హైదరాబాద్ లో ఘనంగా విడుదలైంది. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

Add Zee News as a Preferred Source

ప్రముఖ నటులు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి .. ముగ్గురికి కూడా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక వీరి ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ 45 టీజర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం. రమేష్ రెడ్డి మాట్లాడుతూ, “45 ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ కలిగిన చిత్రం. ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వగల సినిమా ఇది. సనాతన ధర్మం అంశాలు కూడా ఇందులో ఉన్నాయి” అన్నారు. దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ, “ఈ సినిమాను ముందుగా విజువలైజ్ చేసి, ఆపై షూటింగ్ చేశాం. ఇది కొత్త పద్ధతిగా నిలుస్తుంది” అన్నారు.

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ, “ఈ చిత్రంలో నా లుక్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓం సినిమాకు సంబంధించిన డైలాగ్‌ను ఈ సినిమాలో క్రియేటివ్‌గా వాడారు” అన్నారు. ఆయన అర్జున్ జన్యా డైరెక్షన్‌పై ప్రశంసలు కురిపించారు.

శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, “45 కథను నాలుగు నిమిషాల్లోనే అర్థం అయ్యేలా చెప్పారు. కథే ఈ సినిమాలో హీరో. చివర్లో నాకు క్యాన్సర్ అని తెలిసినా షూటింగ్ పూర్తి చేశాను. డెడికేషన్‌తో పనిచేయడం నాకు అలవాటు” అన్నారు.

ఇక, ఈ చిత్రానికి అర్జున్ జన్యా కథ, సంగీతం, దర్శకత్వం అందిస్తుండగా, సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ, కేఎం ప్రకాష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.

ఇక ఉపేంద్ర ఈ మధ్యనే యుఐ.. చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పరవాలేదు అనిపించకుంది. అయితే చాలా కొత్త కాన్సెప్ట్ తో రావడంతో.. ఈ సినిమాపై అప్పుడు కొన్ని ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. మరోపక్క శివరాజ్ కుమార్ ఈ మధ్య రజనీకాంత్ జైలర్ చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అర్ధగంట పాటు అతలాకుతలం

Also Read: Tariff war-Investors: ఎంత పని చేశావ్‌ ట్రంప్‌.. నీ వల్ల నిద్ర కూడా పట్టడంలేదు.. ఇన్వెస్టర్ల షాకింగ్ కామెంట్స్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News