
6 Journey trailer update: పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘6జర్నీ’ ప్రస్తుతం సినిమాప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. బసీర్ అలూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించారు. ముఖ్య పాత్రల్లో రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్, సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, వినూత్న కథనం ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి.
దర్శకుడు బసీర్ మాట్లాడుతూ, “సమీర్ అద్భుతంగా నటించాడు. రవి ప్రకాష్ రెడ్డి ముందుండి ప్రోత్సహించడంతో సినిమా ఈ స్థాయికి వచ్చింది. టేస్టీ తేజ మంచి ఎనర్జీతో కనిపిస్తాడు. సంగీత దర్శకుడు సింహ మంచి పాటలు అందించారు. సురేందర్ రెడ్డి గారి సాయం మర్చలేను. మా నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు,” అని తెలిపారు.
హీరో సమీర్ దత్త మాట్లాడుతూ, “‘6జర్నీ’ ఒక డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. మా టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాం. బసీర్ గారు సినిమాను బాగా తీశారు. ఏప్రిల్ 25న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను,” అన్నారు.
హీరోయిన్ పల్లవి రాథోడ్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి వర్గానికి నచ్చేలా ఉంటుంది. బసీర్ గారు, నిర్మాతగారి సహకారంతో సినిమా బాగా వచ్చింది,” అని అన్నారు.
నటుడు టేస్టీ తేజ చెప్పినట్లు, “‘6జర్నీ’లో నేను పూర్తిస్థాయి పాత్రలో కనిపించబోతున్నాను. ఇది నాకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకువస్తుంది. బసీర్ గారు, నిర్మాత గారి సహకారం లేకపోతే ఇది సాధ్యం కాదు,” అన్నారు.
నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, “లవ్, యాక్షన్, మిస్టరీ వంటి అన్ని అంశాలతో 6జర్నీ చిత్రాన్ని రూపొందించాం. ట్రైలర్‌కు వచ్చిన మంచి స్పందన మాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఏప్రిల్ 25న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం,” అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి