)
Shambala Movie Trailer Released By Prabhas: ఆది సాయి కుమార్ హీరోగా ఉగంధర్ ముని డైరెక్షన్ లో వస్తున్న సూపర్ న్యాచురల్ సినిమా శంబాల. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లో రాజశేఖర్ అన్నభిమోజు, మహిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో ఆది సాయి కుమార్ సరసన హీరోయిన్గా అర్చన అయ్యార్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా.. శ్వాసిక, రవి వర్మ, మధునందన్ ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించారు. టీజర్‌తోనే సినిమాపై బజ్ పెరిగేలా చేసుకున్న శంబాల టీం.. లేటెస్ట్గా ట్రైలర్‌తో ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేశారు. ఈ ట్రైలర్‌ని రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
శంబాల కథ గురించి చెప్పుకుంటే వేల సంవత్సరాల క్రితం రాక్షసుడితో శివుడు యుద్ధం చేస్తున్న టైంలో శివుని చెమట చుక్క భూమి మీద పడుతుంది. అది ఒక ఊరిలో ఉండగా దాని చుట్టూ కొన్ని శక్తులు ఆవహించి ఊరి ప్రజలను బలి తీసుకుంటాయి. అయితే ఈ మిస్టరీని చేధించేందుకు జియో సైంటిస్ట్ అయిన హీరో రంగంలోకి దిగుతాడు. ఊళ్లో వరుస హత్యలకు కారణం ఎవరు..? ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కి రీజన్ ఏంటి..? దైవం నమ్మని హీరో ఊళ్లో జరిగే పరిణామాలను ఎలా సాల్వ్ చేశాడు అన్నది శంబాల కథ. ట్రైలర్ లోనే చెప్పాలనుకున్న కథ ఏంటన్నది చూపించారు. ఈ ట్రైలర్లో విజువల్స్ చాలా బాగున్నాయి. ఆది సాయి కుమార్ రోల్ ఇంటెన్సివ్ గా బాగా చేశాడనిపిస్తుంది. ఇక సినిమాలో కెమెరా వర్క్, ఇంకా విజువల్స్ ఆడియన్స్‌కి మంచి థ్రిల్ కలిగించేలా ఉన్నాయి.
ఆది సాయి కుమార్ యాక్షన్, అప్పియరెన్స్ మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. యుగంధర్ ముని మేకింగ్, ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల హాంటింగ్ బీజీఎం అద్భుతంగా ఉన్నాయి. ఇక నిర్మాతలు రాజశేఖర్ అన్న భిమోజు, మహీధర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
శంబాల సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook