
ఆది సాయి కుమార్, అవికా గోర్ హీరో, హీరోయిన్లుగా షణ్ముగం సప్పాని దర్శకత్వంలో తెరకెక్కింది. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
షణ్ముఖ స్టోరీ విషయానికొస్తే.. షణ్ముఖ (ఆరు తలల వ్యక్తి ) ఆరు తలలతో వింతగా వికృతంగా పుడతాడు. అతన్ని మాములు మనిషి చేయడానికి అతని తండ్రి క్షుద్ర దేవతలను పూజిస్తుంటాడు. అంతేకాదు తాంత్రిక పూజలను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన ఆరు రాశుల్లో పుట్టిన అమ్మాయిల రక్తంతో షణ్ముఖుడిని సూర్య గ్రహణం వచ్చే అమావాస్య రోజున రక్త తర్పణం చేస్తే మాములు మనిషి అవుతాడు. అంతేకాదు ఈ ఆరుగురు అమ్మాయిల రక్త తర్పణం తర్వాత నవగ్రహాలు ప్రత్యేక స్థానంలో ఉండగా పుట్టిన ఓ అమ్మాయి క్లీంకార పేరుతో పుట్టిన అమ్మాయి రక్తంతో చివర్లో షణ్ముఖుడికి తర్పణమిస్తే.. అతను అందగాడు నిత్య యవ్వనుడు అవుతాడని తాంత్రికులు చెప్పగా.. షణ్ముఖ తండ్రి ఆరు ప్రత్యేక రాశుల్లో పుట్టిన అమ్మాయిలను దొరకపట్టి పట్టుకొస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. మరోవైపు ఇంట్లో మిస్సింగ్ అయిన అమ్మాయిల కేసును సూర్య (ఆది సాయికుమార్) టేకప్ చేస్తాడు. అతనికి సారా (అవికా గోర్) ఎలా సహాయ పడింది. మరి షణ్ముఖుడు మాములు మనిషి కావడానికి షణ్ముఖ తండ్రి కిడ్నాప్ చేసిన ఆ ఆరుగురు అమ్మాయిలను సూర్య ఎలా రక్షించాడు అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు షణ్ముగం సప్పాని తాను చెప్పాలనుకున్న కథ బాగున్నా.. దాన్ని తెరకెక్కించే విధానంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. అపుడపుడు మన దగ్గర కొంత మంది వింత ఆకారంలో పుడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి ఇతివృత్తాన్ని బేస్ చేసుకొని దానికి నక్షత్రాలు.. గ్రహ కూటమి ఆధారంగా కొన్ని ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలను బలి ఇస్తే వికృతంగా వింతగా పుట్టిన షణ్ముఖుడిని మాములు మనిషి చేయాలన్న తండ్రి తాపత్రయం కనిపించినా.. ఏది ఏమైనా ఇతరులకు హాని కలిగిస్తూ తన సుఖాపడాలనుకోవడాన్ని సమాజం హర్షించదు. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో కొన్ని సీన్స్ చూస్తే దర్శకుడు మరి ఇంత సిల్లీగా ఎలా తెరకెక్కించాడనేది అనే అనుమానులు వస్తాయి. ఆ సంగతి పక్కన పెడితే.. హార్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుందనే చెప్పాలి. ఇందులో క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు పూజలు విషయంలో దర్శకుడు మరింత పరిశోధన చేసి తెరకెక్కిస్తే సినిమా మరో లెవల్లో ఉండేది. తెరపై హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ ఇస్తుంది. కానీ సినిమాలో అది అవసరం లేకున్నా.. కావాలని ఇరికించినట్టు ఉంది. సంగీత దర్శకుడు ఆర్ఆర్ విషయంలో మరింత శ్రద్ద పెట్టాల్సింది. నిర్మాణ విలువులు ఓకే. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు అంతగా పదును పెట్టలేదనే చెప్పాలి.
నటీనటుల విషయానికొస్తే..
ఆది కుమార్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో ఎస్సై సూర్య పాత్రలో అలరించారు. అవికా గోర్ చాలా కాలం తర్వాత తెరపై గ్లామరస్ గా కనిపించింది. ఇక మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. థ్రిల్ చేసే‘షణ్ముఖ’..
రేటింగ్.. 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe