Acharya Pre-Release: మెగాస్టార్ చిరంజీవి, రామ్​ చరణ్​లు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదల కరోనా కారణంగా వాయిదా పడుతూ రాగా.. ఎట్టకేలకు ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆచార్య ప్రమోషన్స్​లో నిమజ్ఞమైంది. చిరంజీవి, రామ్​ చరణ్​లు పార్తలు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్​.. అంచనాలను మరింత పెంచింది.


ముఖ్య అతిథి ఎవరంటే..


ఈ అంచనాల నేపథ్యంలో ఏప్రిల్ 23న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించాలని చిత్ర యూనిట్​ నిర్ణయించినట్లు సమాచారం. అయిత ఈ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ముఖ్య అతిథిపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది. విజయవాడలో ఈ ఈవెంట్​ను నిర్వహించి.. సీఎం జగన్​ను ముఖ్య అతిథిగా పిలవాలని చిత్ర యూనిట్​ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్​ ఇందుకు ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.


సినిమా టికెట్ ధరల పెంపుపై చిరంజీవి సహా పలువురు సీఎం జగన్​తో చర్చించిన అనంతరం..  టికెట్ ధరలను పెంచుకునేందుకు వీలుగా జగన్ సర్కార్​ జీవో తెచ్చింది. ఇందుకు కృతజ్ఞతగానే చిరంజీవి తన సినిమాకు సీఎం జగన్​ను ముఖ్య అతిథిగా పిలవాలని నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాల టాక్​.


ఇదే కాకుండా.. ఆచార్య మూవీ నిర్మాత నిరంజన్​ రెడ్డి సీఎం జగన్​కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణం కూడా ఆయన్ను ప్రీ రిలీజ్ ఈవెంట్​కు పిలిచేందుకు కారణం కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


అయతే ఆచార్య టీం నుంచి.. ప్రీ రిలీజ్ ఈవెంట్​ గురించి గానీ, సీఎం జగన్​ చీఫ్​ గెస్ట్​గా రావడం గురించి గానీ అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్​ ప్లాన్​ ఉంటే త్వరలోనే చిత్ర యూనిట్​ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


ఆచార్య మూవీలో కాజల్​, పూజా హెగ్డే, సోనూ సూద్​, వెన్నెల కిశోర్​, తనికేళ్ల భరణి, అజయ్ సహా పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.


Also read; Jayamma Panchayathi: సుమ నోట 'బూతు' మాట... ఆకట్టుకుంటోన్న 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్...


Also read: Samantha Workout Video Viral: హెవీ వెయిట్‌లను ఈజీగా ఎత్తేస్తున్న సమంత, వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook