Shambala Movie: హారర్ థ్రిల్లర్ ‘శంబాల’పై ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ కథా నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఒక్కో పోస్టర్ వదులుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న చిత్రబృందం ఈ సినిమాలో కీలక పాత్రధారిని పరిచయం చేసింది. యువ నటుడు ఆది సాయికుమార్ హీరో నటిస్తుండగా.. ఈ సినిమాలో కీలక పాత్ర మరొకరు పోషిస్తున్నాడు. అతడు ఎవరు? ఏ పాత్ర చేస్తున్నాడో తెలుసుకుందాం.
Also Read: Telugu Hero: హీరోయిన్‌ను గర్భవతిని చేసి మోసానికి పాల్పడ్డ 'తెలుగు స్టార్ హీరో'
యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. ప్రామిసింగ్ స్టార్ ఆది సాయికుమార్ తొలిసారిగా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, అర్చనా అయ్యర్, స్వసిక కారెక్టర్ లుక్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం చిత్రబృందం మరో కీలక పాత్రను పరిచయం చేసింది.
టాలెంటెడ్ ఆర్టిస్ట్ మధునందన్ 'శంబాల' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. హనుమంతు అనే కానిస్టేబుల్ పాత్రలో మధునందన్ మెరుస్తున్నాడు. అతడి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ముఖంపై భయం.. లాంతరు పట్టుకుని దిక్కులు చూస్తున్నట్టుగా కనిపిస్తున్న పోస్టర్.. వెనుక గోడపై ఒక దిష్టిబొమ్మ, వెనకాల ఒక ఆలయం ఇవన్నీ చూస్తుంటే సినిమాలో మధునందన్ పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం శంబాల సినిమా షూటింగ్ ప్రధానంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో రవివర్మ, మీసాల లక్ష్మణ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. పురాతన యుగం, వేల ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల ఆధారంగా ఓ అద్భుతమైన కల్పనకు 'శంబాల'తో ప్రాణం పోస్తున్నారు. విజువల్ వండర్‌గా, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో శంబాల సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను చిత్రబృందం ప్రకటించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









