Actor Prakash Raj Reacts On Pahalgam Terror Attack: పహాల్గంలో ఉగ్రమూకలు చేసిన మారణ కాండపై దేశమంతట పార్టీల కతీతంగా రాజకీయ నేతలు, సెలబ్రీటీలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి, విజయ్ దేవర కొండ, అల్లు అర్జున్, సాయిపల్లవి.. మొదలైన సెలబ్రీటీలు స్పందించారు. అయితే.. ప్రతిసారి ప్రకాష్ రాజ్..ఏపీ డిప్యూటీ సీఎం ను టార్గెట్ గా చేసుకుని పోస్టులు పెడుతుంటారు.
ఆయన ఏది మాట్లాడిన.. జస్ట్ ఆస్కీంగ్ అంటూ ఏదో ఒక సెటైర్ పెడుతునే ఉంటారు.ఈ క్రమంలో పహాల్గంపై ఎందుకు స్పందించలేదని నెటిజన్లు ఒక రేంజ్ లో ప్రకాష్ రాజ్ను ట్రోల్స్ చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ దిగొచ్చినట్లు తెలుస్తొంది. పహల్గం దాడిపై ఆయన రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రదాడికి ఖండిస్తు, పిరికి పంద చర్యగా చెప్పుకొచ్చారు. అమాయకులపైన టూరిస్టులను హతమార్చడం ఘోరమన్నారు.
ఈ ఘటనతో కశ్మీర్ ప్రజల గుండె పగిలిందన్నారు. వాళ్లంతా ముక్తకంఠంతో మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కశ్మీర్ ఆటస్థలం కాదని ... ప్రకాష్ రాజ్ సీరియస్ గా మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణం, సెలయేళ్లు, నేచర్ ను ఒక్కసారిగా డిస్టర్ట్ చేసి.. రక్తపాతం పారేలా చేశారన్నారు. ఈ చర్య కశ్మీరీలు చేసింది కాదన్నారు. అంతేకాకుండా.. కశ్మీర్ ప్రజలంతా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
Read more: Pahalgam Terror Attack: పాకిస్థాన్‌కు మరో ఝులక్..ఆ హీరో సినిమాను బ్యాన్ చేసిన భారత్..!
టూరిస్టులు వచ్చి ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణంను..ఈ విధంగా రణరంగంగా మార్చిన ఉగ్రచర్యను పిరికి పంద చర్యగా ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. మొత్తంగా కశ్మీర్ లో జరిగిన ఘటన మాత్రం చాలా ఘోరమని చెబుతూ.. అసువులు బాసిన వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించారు. బాధితుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









