Ram Charan Emotional: 'నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు మా పాఠశాలతో పాటు వెళ్లేవాడిని. అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్నీ కావాల్సి ఉంది. కొన్ని సంవత్సరాల కిందట వార్తలు విన్నాం. 2014-15 కొన్ని పాఠశాల బయట నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు.. వంటి తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్లేవాళ్లం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు అయిపోయింది. పిల్లలకి ఐస్ క్రీమ్‌లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా పోయింది' అని రామ్ చరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా అయిపోయిందా? అనేది దిగ్భ్రాంతిగా ఉంది. ఇది చాలా బాధేసింది' అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Vijay Deverakonda: 'నాదో చిన్న ప్రపంచం'.. జీవితంపై హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ శిల్పాకళా వేదికలో గురువారం జరిగిన మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో రామ్ చరణ్ పాల్గొని మాట్లాడారు. 'మన సిటీ గాని మనం పంపించే స్కూల్స్ గాని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూల్ నుంచి చేపిస్తున్నాం. కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటకు పంపించాలంటే మాకు కూడా అలా ఆందోళనకరంగా ఉంది' అని రామ్ చరణ్ తెలిపారు. 'పొద్దునే వర్కవుట్ చేసి ఒక షూటింగ్‌కు వెళ్లి సాయంత్రం వచ్చి ఒక మంచి గేమ్ ఆడి కుటుంబంతో కొంత సమయం గడిపి అది విలువైన సమయం గడపడం అంటారు. ఇంతటి ముఖ్యమైన విలువైన సమయం గడిపి మంచి స్నానం చేసి పడుకొని మళ్లీ ప్రశాంతంగా లేవడంతో ఎంత సంతోషంగా ఉంటుంది' అని రామ్ చరణ్ వివరించారు.
Also Read: Revanth Reddy: 'నేను, విజయ్ దేవరకొండ ఒక్కటే.. ఎందుకో తెలుసా?: రేవంత్ రెడ్డి
కుటుంబంతో సాయంత్రం విలువైన సమయం పొందడం ఎంతో అద్భుతమైనది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదాం. ఇది మన కుటుంబం, మన అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు.మన ఇంట్లో నుంచి మొదలుపెడదాం' అని రామ్ చరణ్ పిలుపునిచ్చారు. 'మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం. మన పాఠశాలలు.. మన స్నేహితులను రక్షించుకుందాం. మన భవిష్యత్తుని మనమే పరిరక్షించుకుందాం' అని రామ్ చరణ్ సూచించారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినం అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కలలో అనుకోలేదు. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నా' అని రామ్ చరణ్ ప్రకటించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా మారుదామని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









