Dhandoraa Movie Title Song: తన మూవీ సైకో సిద్ధార్థ్ మూవీ వాయిదాపై స్పందించాడు నటుడు నందు. అఖండ-2 మూవీ రిలీజ్ నేపథ్యంలో డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా జనవరి 1కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో దండోరా మూవీ దండోరా సినిమా టైటిల్ సాంగ్ ఈవెంట్‌లో నందు మాట్లాడుతూ.. బాలకృష్ణకు ఒకరు ఎదురెళ్లినా.. బాలకృష్ణ ఎవరికైనా ఎదురొచ్చినా.. రిస్క్ మాత్రం వాళ్లకే.." అంటూ సరదాగా చమత్కరించాడు. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించిన దండోరా మూవీ ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మురళీకాంత్ దర్శకత్వం వహించగా.. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ మూవీని నిర్మించారు.
ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ.. ఈ మూవీలో ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, ఎగ్రేషన్, డ్రామా అన్నీ ఉన్నాయన్నారు. కోర్టు మూవీ కంటే ముందే ఈ సినిమాను తాను కమిట్ అయ్యాయని.. ఫుల్లీ కంటెంట్ లోడెడ్ మూవీ అని చెప్పారు. ఇందులో అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందని.. ప్రతి క్యారెక్టర్‌కు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందన్నారు. తాను 90స్ కథ వినేటప్పుడు ఎలా ఫీల్ అయ్యానో.. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు అలానే అనిపించిందని అన్నారు. చాలా మంచి కథ అని.. ఈ మూవీ గురించి దేశం మాట్లాడుతుందేమోనని అనిపిస్తోందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఆశీర్వదించాలని కోరారు.
హీరో నందు మాట్లాడుతూ.. ఈ సాంగ్‌తో మార్క్ కె రాబిన్‌కు మంచి పేరు వస్తుందన్నారు. డైరెక్టర్‌గా తొలి సినిమా అయినా.. ఇంత స్పాన్ ఉన్న కథను మురళీకాంత్ చాలా చక్కగా చెప్పటం గొప్ప విషయమన్నారు. కుల వ్యవస్థపై జరుగుతున్న చాలా లోతైన విషయాలను తెరపై అద్భుతంగా చూపించారని అన్నారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు. హీరో రవికృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది అందరూ ఈ సినిమాను గుర్తుపెట్టుకుంటారని అన్నారు. టీజర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్‌ను అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు.
డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ.. మార్క్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని చెప్పారు. డిసెంబర్ 25న థియేటర్స్‌కు వచ్చి సినిమా చూడాలని కోరారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ సాంగ్‌లో ఉన్న ఎమోషన్.. మూవీలోనూ కనిపిస్తుందన్నారు. మంచి కంటెంట్‌ను ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారనే నమ్మకంతో ముందడగు వేశామన్నారు.
Also Read: Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రెగ్నెంట్.. పెళ్లయిన ఎన్ని నెలలకంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









