Vijay Antony Daughter Meera Death News: తమిళ స్టార్ హీరో, దర్శకుడు, ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ ఆంటోని కూతురు మీరా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె ప్రాణాలు తీసుకుంది. ప్రస్తుతం మీరా ప్లస్ 2 అంటే ఇంటర్మీడియల్ సెకండ్ ఇయర్ చదువుతుండగా.. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. చదువుల ఒత్తిడే కారణమై ఉంటుందని అనుకున్నారు. గూగుల్‌లో ఆమె లారా అని చూపిస్తుండగా.. తమిళ మీడియా మాత్రం మీరా అని చెబుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ ఆంటోని కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్డులో నివాసం ఉంటోంది. మీరా చెన్నైలోని ప్రముఖ ప్రైవేట్ స్కూల్ చర్చి పార్క్‌లో 12వ తరగతి చదువుతోంది. రాత్రి తన రూమ్‌లో నిద్రపోయిన మీరా.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎలక్ట్రిక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. గమనించిన విజయ్ ఆంటోని.. ఇంటి సిబ్బంది సహాయంతో ఆమెను కావేరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఆళ్వార్‌పేట పోలీసులు  కావేరీ ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


ఇటీవల షూటింగ్‌ సెట్‌లో ప్రమాదానికి గురైన విజయ్ ఆంటోని.. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు. ఇంతలోనే కూతరు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విజయ్ ఆంటోనీ కూతురు మీరా మరణం పట్ల సినీ పరిశ్రమ, ఆయన అభిమానులు సంతాపం తెలిపారు. విజయ్ ఆంటోనికి ధైర్యం చెబుతున్నారు.  


ఆత్మహత్య ఆలోచనల గురించి గతంలో విజయ్ ఆంటోని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సూసైడ్ ఎందుకు చేసుకుంటారు..? అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి..? అనే విషయంపై విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోతే ఆత్మహత్య ఆలోచనలు వస్తాయన్నాడు. కమిట్మెమెంట్‌గా పనిచేయనప్పుడు.. పిల్లలకు చదువుల ఒత్తిడి విషయంలో సూసైడ్ థాట్స్‌ వస్తాయని అన్నాడు. ఇప్పుడు అలాంటి ఒత్తిడి కారణంగానే విజయ్ కూతురు మరణించడం విషాదాన్ని నింపింది.


Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!  


Also Read: Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook