Vishal Health: సినీ పరిశ్రమలో కలవరం.. హీరో విశాల్‌ ఆరోగ్యం విషమం?

Hero Vishal Again Fainted In A Event: సినీ పరిశ్రమలో మరోసారి కలవరం మొదలైంది. హీరో విశాల్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది. తాజాగా మరో ఈవెంట్‌లో ఆయన అకస్మాత్తుగా కిందపడిపోయారు. దీంతో విశాల్‌కు ఏమైంది? ఎందుకు ఇలా అనే చర్చ జరుగుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 11, 2025, 11:57 PM IST
Vishal Health: సినీ పరిశ్రమలో కలవరం.. హీరో విశాల్‌ ఆరోగ్యం విషమం?

Vishal Health Condition: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు విశాల్‌ ఆరోగ్యం ఆందోళన నెలకొంది. కొద్ది నెలలుగా అతడి ఆరోగ్యం సరిగ్గా లేనట్టు తెలుస్తోంది. గతంలోనే సినీ కార్యక్రమాల్లో బక్కచిక్కి.. చేతులు.. శరీరం వణుకుతూ కనిపించింది. ఒక కార్యక్రమంలో స్పృత తప్పిపడిపోయాడు కూడా. తాజాగా మరోసారి విశాల్‌ స్పృహ తప్పి పడిపోయాడు. ఓ ఈవెంట్‌కు హాజరైన విశాల్‌ పడిపోవడంతో అక్కడ కలకలం ఏర్పడింది. వెంటనే అతడి సహాయకులు, నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Mothers Day: మదర్స్‌ డే ట్వీట్‌ వైరల్‌.. పర్వాలేదు మాజీ సీఎం వైఎస్ జగన్‌కు 'అమ్మ' గుర్తు ఉంది

తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి మిస్ ట్రాన్స్‌జెండర్ 2025 అందాల పోటీలు జరిగాయి. ట్రాన్స్‌జెండర్ల అందాల పోటీలకు హీరో విశాల్ ప్రత్యేక అతిథిగా పాల్గొని సందడి చేశారు. అక్కడ హాజరైన వారిని పలకరిస్తూ నిలబడ్డాడు. అయితే అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయాడు. దీంతో ఏం జరిగిందో అర్థం అందరూ గందరగోళానికి గురయ్యారు. వెంటనే అక్కడి వారు సపర్యలు చేయడంతో విశాల్‌ కళ్లు తెరిచాడు. అనంతరం విశాల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Also Read: TS EAPCET Results: వివాదంలో తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు.. హరీశ్‌ రావు ఖండన

కొన్ని నెలల కిందట  తాను నటించిన 'మధ గజ రాజా' ప్రీ-రివ్యూలో మీట్‌లో విశాల్‌ ఊహించని స్థితిలో కనిపించాడు. చాలా బలహీనంగా.. నీరసంగా కనిపించడంతో అతడి ఆరోగ్యంపై చర్చ జరిగింది. ముఖం వాడిపోయి.. నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మరో కార్యక్రమంలో మాట్లాడుతుండగా చేతులు, శరీరం వణికింది. నాలుగు ముక్కలు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు. దీంతో ఆయ‌న ఆరోగ్యంపై సినీ పరిశ్రమతోపాటు అభిమానుల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. విశాల్‌కు ఏమైంది? ఎందుకు ఇలా అనారోగ్యానికి గురవుతున్నాడు? అంటూ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు.

ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం వైద్యులు పరీక్షించి విశాల్‌ ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశారు. విశాల్‌కు వైరల్ ఫీవర్ సోకిందని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. విశాల్‌కు కొన్నాళ్లు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే విశాల్‌ ఉన్నాడు. విశాల్‌ అనారోగ్యంపై తమిళ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. విశాల్‌ను పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News