Actors Condemns Allu Arjun Arrest: సినిమా థియేటర్‌లో తొక్కిసలాటకు కారణంగా చూపుతూ ఐకాస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేయడం రాజకీయంగా.. సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్న సంఘటనను తీసుకుని జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న అల్లు అర్జున్‌ చేయడం సరికాదని తప్పుబడుతున్నారు. సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. అరెస్ట్‌పై స్పందించాలని ఉన్నా కూడా కొంత వెనుకడుగు వేస్తున్న సినీ ప్రముఖులు ఎందరో ఉన్నా.. కొందరు నటీనటులు, సినీ ప్రముఖులు మాత్రం బహిరంగంగా అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌, నటుడు బ్రహ్మాజీ తదితరులు స్పందించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నేనేమీ చేసేది లేదు


కొత్త వ్యాధి
'బ్రేకింగ్ న్యూస్: చాలా మంది సినీ ప్రముఖులు 'పుష్పైటిస్' అనే అరుదైన.. వింత వ్యాధితో బాధపడుతున్నారు' అంటూ అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై వ్యంగ్యంగా స్పందించారు. అల్లు అర్జున్‌పై సినీ పరిశ్రమలో కొందరు కుట్ర పన్నుతున్నారని.. పుష్ప 2 ది రూల్‌ సినిమా విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి కుట్రలు పారాయని పరోక్షంగా ప్రస్తావించారు. పుష్ప సినిమాను వీలైనంతగా హిట్‌ కాకుండా తగ్గించాలని చేసిన ప్రయత్నాలను పరోక్షంగా గుర్తు చేశారు.


Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్‌లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం


సగం మంది లోపలే
'దేశంలో చాలా చోట్ల తొక్కిసలాట జరిగింది. ఎవరినైనా అరెస్ట్‌ చేశారా? చేస్తే సగం మంది రాజకీయ నాయకులు లోపల ఉండాలి' అంటూ బ్రహ్మాజీ 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.




నటుడి బాధ్యత మాత్రమే కాదు
'భద్రతా కారణాల్లో విఫలమైతే నటుడి బాధ్యత మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులకు తెలియజేయవచ్చు. పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన సంఘటన విషాదకరమైంది. ఆ సంఘటనకు నేను తీవ్ర ప్రగాఢం తెలియచేస్తున్నా. కానీ ఈ ఘటనలో ఒకరిపై మాత్రమే నిందలు వేయలేం' అని వరుణ్‌ ధావన్‌ తెలిపారు. తాను నటించిన 'బేబీ జాన్‌' సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా జైపూర్‌లో మీడియా అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter