Karmasthalam Movie First Look: మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో రాకీ షెర్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కర్మ స్థలం. రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మించారు. అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తుండగా.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో పాత్రలు, డిజైన్ అదిరిపోయాలా ఉంది. బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో చూస్తుంటే.. వీఎఫ్‌ఎక్స్ ఓ రేంజ్‌లో వాడినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే మూవీపై అంచనాలు క్రియేట్ చేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. డైరెక్టర్ మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించి.. కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్ పెట్టారని అన్నారు. ఆయన కథను చెప్పేందుకు వచ్చినప్పుడు.. కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నానని.. స్టోరీ అద్భుతంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. అంతే అద్భుతంగా ప్రొడ్యూసర్ శ్రీనివాస్‌తో కలిసి తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని.. తన హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా అని అన్నారు.
డైరెక్టర్ రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాము అంతా ప్రాణం పెట్టి.. ఎంతో ఇష్టంతో పనిచేశామన్నారు. VFX పనుల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిందని.. పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దామన్నారు. నిర్మాత శ్రీనివాస్ తన వెన్నంటి ఉండి నడిపించారని.. అర్చన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు. నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. దర్శకుడు రాకీ ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో అందరినీ ఆకట్టుకునేలా చేశారని తెలిపారు. సినిమాను ఆడియన్స్ పెద్ద హిట్ చేయాలని కోరారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎల్. రాజా మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయని.. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందన్నారు.
Also Read: Delhi Elections 2025: ఢిల్లీలో గెలుపెవరిది..? దేశ రాజధానిలో మైకులు బంద్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









