Khushboo transformation: ఖుష్బూ సుందర్ ముంబయి నుండి వచ్చినా..దక్షిణ భారత సినిమాల్లో ముఖ్యంగా తమిళనాట.. ఓ విశేషమైన గుర్తింపు పొందారు. తెలుగులో "కలియుగ పాండవులు" చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటించి పరిచయమయ్యారు ఈ నటి. కొద్ది కాలంలోనే దక్షిణ భారత సినీ పరిశ్రమలో.. అగ్రహీరోలతో సినిమాలు చేసి స్టార్ ఇమేజ్‌ను పొందారు.
పెళ్లి అయినా అనంతరం కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా, తరువాత తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించి.. తన వయసుకు తగ్గ పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపై న్యాయనిర్ణేతగా.. కూడా పలు షోల్లో కనిపిస్తూ బిజీగా ఉన్నారు.
రాజకీయ రంగంలోకి కూడా ఖుష్బూ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదట డీఎంకే, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలలో పని చేశారు. ప్రస్తుతం బీజేపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అయినా రాజకీయాలపై ఆమె ఆసక్తి తగ్గలేదు.
Khushboo Young Look: ఇక వీటన్నిటిని పక్కన పెడితే..సోషల్ మీడియాలో ఖుష్బూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో ఆమె ఐదు పదుల వయస్సులోనూ 20 ఏళ్ల యువతిలా కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొందరు ఆమెపై విమర్శలు చేస్తూ ఇంజెక్షన్ల వల్లే ఇలా మారిందంటూ ట్రోల్ చేశారు. దీనిపై ఖుష్బూ ఘాటుగా స్పందిస్తూ విమర్శకులపై విమర్శలు గుప్పించారు.
మీరు మనుషులా? మీ ముఖాలను ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చూపించరు? ఎందుకంటే మీరు అంతా అసహ్యంగా ఉంటారు కాబట్టి.. మీ పేరెంట్స్‌ను చూస్తుంటే సానుభూతి కలుగుతోందని కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చాడు ఖుష్బూ
What a pain people like you are. You guys never show your faces becoz you know you are ugly from within. I pity your parents. https://t.co/IB0RMRatxl
— KhushbuSundar (@khushsundar) April 15, 2025
Also Read: AP Rains: ఇటు గాలులు.. అటు పిడుగులు.. ఏపీకి బిగ్ అలర్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









