Bandi movie Review:‘బండి’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

Bandi movie Review: తెలుగులో ఒకప్పుడు ఏకాపాత్రాభినయం అంటూ ఒకే మనిషితో నాటకాలు వస్తుండేవి. అతనే అన్ని వేషాలు వేసేవాడు. కానీ ఇపుడు అదే తరహాలో ఒకే పాత్రతో కొన్ని చిత్రాలు వచ్చాయి. రీసెంట్ గా మోహన్ లాల్ హీరోగా ‘ఎలోన్’ మూవీ కూడా ఒకే ఒక పాత్రతో తెరకెక్కింది. ఇపుడు అదే రూట్లో ఆదిత్య ఓం హీరోగా ‘బండి’ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2025, 05:33 PM IST
Bandi movie Review:‘బండి’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య ఓం ముఖ్యపాత్రలో అనే కంటే ఒకే ఒక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బండి’ మూవీ ఈ రోజే థియేట్రికల్ గా రిలీజైంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. రఘు తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  అంచనాలను అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

Add Zee News as a Preferred Source

కథవిషయానికొస్తే..
ఆదిత్య వర్మ (ఆదిత్య ఓం) కుటుంబం .. మానవ సంబంధాల కంటే డబ్బే ప్రాణంగా జీవించే స్వార్ధ పూరిత వ్యక్తి. అయితే ఓ రోజు అతనికీ ఓ కాల్ వస్తోంది. ఆ తర్వాత అతని జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత అతను ఆమెను వెతుక్కుంటూ అడవిలోకి వెళతారు. ఈ క్రమంలో ప్రకృతిని అడవులను నాశనం చేయాలనుకుంటాడు. ఆ తర్వాత  అతను అడవిలో  ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడు. చివరకు ఏమైందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

అసలు ఒక సింగిల్ పాయింట్ కథను సింగిల్ మనిషితో తీయటమనేదే పెద్ద టాస్క్. అందులో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అడవుల వలన పర్యావరణ సమతుల్యం కారణంగా మనకు వర్షాలు పడుతున్నాయి. వృక్షో రక్షతి రక్షిత: అనే సూక్తి ప్రకారం అడవులను లేదా ప్రకృతిని మనం సంరక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయనే సందేశాన్ని ఈ సినిమాలో చూపించాడు. మన జీవితం కూడా ఓ  చైన్ లాంటిది. ఒక దానితో మరొకటి ఆధారపడి జీవించాల్సిందే. అందులో ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా.. అవి ప్రకృతి వినాశనానికి దారి తీస్తాయనేది ఈ సినిమాలో ఆదిత్య వర్మ పాత్రతో చెప్పించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో నిర్మాణ విలువులు బాగున్నాయి. మధుసూదన్ ప్రకృతి,అడవి అందాలను చక్కగా తెరపై ప్రెజెంట్ చేసాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. ఎక్కడ అనవరసమైన సీన్స్ కూడా లేవు. మొత్తంగా ఈ సినిమాతో ప్రకృతిని సంరక్షించుకుంటనే మనకు మనుగడ అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. సినిమా రన్ టైమ్ కూడా పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఆదిత్య ఓం నటన విషయానికొస్తే..

ఆదిత్య ఓం మొత్తంగా సింగిల్ గా ఉండే క్యారెక్టర్ తో ఈ సినిమా అటెంప్ట్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో అతని నటన ఆకట్టుకుంటుంది. తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. ఓ స్వార్దపరుడి పాత్రలో ఒదిగిపోయాడు. తన లైఫ్ టైమ్ లో దక్కిన మంచి పాత్ర అని చెప్పాలి.

పంచ్ లైన్.. ప్రకృతిని ‘బంది’ చేయకూడదనే సందేశం ఇచ్చే చిత్రం..

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News