Vijay Deverakonda College Life: కళాశాల లైఫ్‌లో రిస్కులు చేయాలని.. తిరిగి చూసుకుంటే మనకు, మనము భయాన్ని కూడగట్టేలా కనిపిస్తాయి' అని ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. తాను గతంలో చేసిన రిస్క్‌లు.. స్టంట్‌లు ఇప్పుడు తలచుకుంటే భయమేస్తోందని తెలిపాడు. యువత కూడా రిస్క్‌లు చేయాలని కానీ జాగ్రత్తగా చేయాలని సూచించాడు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను రౌడీ హీరో గుర్తు చేసుకున్నాడు.
Also Read: GST Notice To Labour: జీఎస్టీ నోటీసులు చూసి కూలీ షాక్.. రూ.22 లక్షల జీఎస్టీ ఏంది సామి
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని అనురాగ్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి, పల్లా అనురాగ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సినీ నటుడు విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ.. వారితో ఫొటోలు దిగి ఉత్సాహపరిచారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను తెలిపాడు.
Also Read: Sivaji: ‘కోర్ట్’ మూవీతో మారిపోయిన శివాజీ జాతకం.. మంగపతిగా నట విశ్వరూపం..
'కళాశాల లైఫ్‌లో చేసిన రిస్క్‌లు ఇప్పుడు తలుచుకుంటే భయమేస్తున్నాయి. వేగంగా వాహనాలు నడపడం ఇప్పుడు భయమేస్తోంది. అప్పుడు ఏమైనా జరిగి ఉంటే ఇప్పుడు హీరోగా మీ కళ్ల ముందే ఉండేవాడిని కాదు' అంటూ తన కాలేజ్ లైఫ్‌ను విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నాడు. 'లైఫ్‌తో కూడుకున్న మరెన్నో రిస్కులు చేస్తాం. అవన్నీ బాగానే కనిపిస్తాయి మరో ఐదు సంవత్సరాలు పోతే కానీ, మనం చేసిన రిస్కులు గుర్తు చేసుకుంటే చాలా భయంకరం వేస్తుంది' అని విజయ్ తెలిపాడు. 'జీవితంలో స్థిరపడతానికి చదువుతో పాటు జీవితానికి ఉన్నత స్థానాన్ని ఇచ్చే లక్ష్యాల కోసం రిస్క్ చేయాలి తప్ప.. ఇతర వాటి కోసం ఎలాంటి రిస్కులు చేసిన జీవితాలను కోల్పోతాం' అని విద్యార్థులకు ఫ్యామిలీ స్టార్ హెచ్చరించాడు.
'ఫ్యామిలీ స్టార్' సినిమాతో మోస్తరు హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలు విజయ్ చేతిలో ఉన్నాయి. కల్కి సినిమాలో విజయ్ కనిపించాడు. కల్కి 2లో విజయ్ పాత్ర నిడివి అధికంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం తన వ్యక్తిగత పనులతో బిజీ ఉన్న విజయ్ త్వరలోనే తన సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. విజయ్ మంచి సినిమా చేస్తే బ్రేక్ ఇవ్వడానికి అతడి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









