Samantha: విడాకుల తర్వాత సమంతకు భారీ జాక్‌పాట్‌.. ఏమిటో తెలుసా?

After Divorce Samantha Get First Success: సినీ కెరీర్‌తోపాటు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సినీ నటి సమంత ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తోంది. సినిమాలతోపాటు వ్యక్తిగత జీవితాన్ని కొత్తగా ప్రారంభించిన సమంతకు తొలి విజయం దక్కింది. అదెమిటో తెలుసా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 18, 2025, 04:06 PM IST
Samantha: విడాకుల తర్వాత సమంతకు భారీ జాక్‌పాట్‌.. ఏమిటో తెలుసా?

Samantha Lucky Hand: సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోనే మంచి టాక్‌ సొంతం చేసుకుని ఆ తర్వాత భారీ హిట్లు ఖాతాలో వేసుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సమయంలోనే తన తొలి నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితం ప్రారంభించగా.. కొన్నాళ్లకే ఆ బంధం విడిపోయింది. పెళ్లి పెటాకులవడంతోపాటు అనారోగ్యానికి గురయి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే నటిగా సినిమాలు తగ్గించగా.. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. తొలి సినిమాతో నిర్మాతగా సమంత విజయం సాధించింది.

Also Read: Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. 25 శాతం డీఏ విడుదల

ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ట్రాలాలా పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి ఇటీవల ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ సంపాదించుకొని బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి చేసిన ఖర్చుతో పోలిస్తే.. ఈ వసూళ్లు మంచివనే చెప్పవచ్చు. ఈ చిత్రం తీయడానికి రూ.3.5 కోట్ల  బడ్జెట్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తుండడంతో ఇప్పటివరకు దాదాపు రూ.పది కోట్లకు చేరాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. బదిలీల మార్గదర్శకాలు విడుదల

ఈ సినిమా విడుదలకు ముందే సమంత క్రేజీతో సినిమా థియేటర్‌లలో సందడి చేసింది. దీనికితోడు టీజర్‌, ట్రైలర్‌తో కూడా ప్రేక్షకులను మెప్పించడంతో థియేటర్‌లలో సీట్లు నిండుకుంటున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌, శాటిలైట్‌ హక్కులను మంచి రేటుకే అమ్ముడుపోయాయని తెలుస్తోంది. షూటింగ్‌కి ముందే ‘జీ’ సంస్థతో సమంత డీల్‌ కుదుర్చుకుంది. సినిమా మొత్తం ఓ సీరియల్‌ చుట్టూ వినోదాత్మకంగా సాగుతుందని ప్రేక్షకులు మౌత్‌ టాక్‌తో ప్రచారం చేస్తున్నారు.

కుర్రకారుతో తీసిన ఈ సినిమాకి రిలీజ్‌ ముందే బిజినెస్‌ జరగడం విశేషం. రిలీజ్‌ తర్వాత మంచి టాక్‌ రావడం.. వసూళ్లు రోజురోజుకి పెరగడంతో ‘శుభం’ సినిమాతో సమంత తొలి సక్సెస్‌ అందుకున్నట్టు చెప్పవచ్చు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతకు తొలిసారి కలిసొచ్చిందని చెప్పవచ్చు. తొలి విజయంగా కూడా పేర్కొన్నవచ్చు. వాస్తవంగా సమంత ఏది మొదలుపెట్టినా విజయం దక్కుతుంది. ఆమె తొలి సినిమా.. తొలి వెబ్‌ సిరీస్‌ ఇలా.. ఇప్పుడు నిర్మాతగా తొలి విజయం అందుకోవడం సినీ పరిశ్రమలో సమంతపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సక్సెస్‌తో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసేందుకు సమంత సిద్ధమైంది. సినీ పరిశ్రమ కొత్త టాలెంట్‌ను అందించడానికి సమంత కృషి చేస్తున్నారు. ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. FacebookTwitter

Trending News