Raveena Tandon Video: ద్యావుడా.. చెవిదిద్దులను గిప్ట్‌గా ఇచ్చేసిన బాలీవుడ్ నటి.. నీది గోల్డ్ గుండె అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

Raveena tandon gifted gold earrings: బాలీవుడ్ నటి ముంబైలోని ఎయిర్ పోర్టులో తన కూతురు రాషా తడానీతో కలిసి ఒక్కసారిగా మెరిసింది. ఇంతలో ఫోటోగ్రాఫర్ లంతా ఆమెను ఫోటోలు తీసేందుకు తెగ ఆసక్తి చూపించారు.ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 8, 2025, 06:12 PM IST
  • మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలీవుడ్ నటి..
  • ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
Raveena Tandon Video: ద్యావుడా.. చెవిదిద్దులను గిప్ట్‌గా ఇచ్చేసిన బాలీవుడ్ నటి.. నీది గోల్డ్ గుండె అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

Raveena tandon gifts gold earrings to photographer video: బాలీవుడ్ నటి రవీనా టాండాన్ ఇటీవల తరచుగా  వార్తలలో ఉంటున్నారు. ఈ భామ ఇటీవల చావా హీరో విక్కీ కౌశాల్ సతీమణి కత్రీనా కైఫ్ కుంభమేళకు వెళ్లి పుణ్యస్నానం చేసినప్పుడు కొంత మంది ఆమె ఫోటోలు వీడియోలు తీసి వివాదస్పదంగా ప్రవర్తించారు. దీనిపై రవీనా టాండన్ మండిపడ్డారు. ఒక యువతిస్నానం చేస్తుండగా..ఆ విధంగా ఫోటోలు, వీడియోలు తీయడం ఎంత వరకు సమంజసం అంటూ మండిపడ్డారు. ఇలాంటి అత్యుత్సాహం ఫ్యాన్స్ ప్రదర్శించడం మానుకొవాలన్నారు.

Add Zee News as a Preferred Source

అయితే.. కొంత మంది మాత్రం రవీనాకు సపోర్ట్ చేయగా మరికొందరు ఆమెకు ఆటిట్యూడ్ బాగా ఎక్కువంటూ మండిపడ్డారు. అయితే..ప్రస్తుతం రవీనా టాండాన్ మారోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ సారి ఆమె చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇటీవల తన కూతురు రాషా తడానీతో కలిసి ముంబైలోని ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడ కొంత మంది ఫోటో గ్రాఫర్లు ఆమెను ఫోటోలు తీశారు. ఆమెకూడా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

 

ఇంతలో ఒక ఫోటో గ్రాఫర్ నటిని.. మీ చెవిదిద్దులు బాగున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇంకేముందీ.. రవీనా టాండన్ తన చెవిదిద్దులు తీసి వెంటనే ఆ ఫోటోగ్రాఫర్ చేతిలో పెట్టేసింది. ఈ పరిణామంతో అక్కడున్న వారంత షాక్ కు గురయ్యారు.

సదరు ఫోటో గ్రాఫర్కు తన గిఫ్ట్ అని రవీనా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ రవీనా కూతరు మాత్రం ఒకింత షాక్ కు గురైంది. అయితే.. రవీనా ఇలా బంగారంను గిఫ్ట్ గా ఇవ్వడం మొదటి సారి కాదు.. గతంతో ఆమె ఒక పెళ్లికి హజరయ్యారు. అప్పుడు పెళ్లికూతురుకి తన బంగారం గాజుల్నిగిఫ్ట్ గా ఇచ్చేశారు.  

ఆ గాజులపై ఆమె భర్త అనిల్ పేరు ఒక దాని మీద, తన పేరు మరో గాజు మీద కూడా రాసి ఉన్నాయి. అంత సెంటిమెంట్ ఉన్నా కూడా.. ఆమె గాజులు ఇచ్చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.మళ్లీ రవీనా టాండన్ చెవిదిద్దులు ఇవ్వడంతో మరోసారి ఆమె చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.

Read more: Shilpa Shetty Video: మాజీ ప్రియుడ్ని చూసి టెంప్ట్ అయిన బాలీవుడ్ బ్యూటీ.. అందరి ముందే ఆ పని..! వీడియో...

వావ్.. రియల్ నీది గొప్ప మనసు తల్లి అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ద్యావుడా ఇది కలనా..నిజమా.. అంటూ విస్తుపోతున్నారు. అయితే.. రవీనా టాండన్ ప్రస్తుతం.. వెల్ కమ్ టు ది జంగిల్ మూవీ చేస్తున్నారు. అనీస్ బజ్మీ డైరెక్ట్ చేస్తున్నాడు. దీనిలో అక్షయ్ కుమార్ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, దిశా పటానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News