Pahalgam Terror Attack: పాకిస్థాన్‌కు మరో ఝులక్..ఆ హీరో సినిమాను బ్యాన్ చేసిన భారత్..!

Fawad Khans movie abir gulal: పాక్ నటుడు ఫావాద్ ఖాన్ హీరోగా అబీర్ గులాల్ సినిమా లో నటించారు. అయితే..ఈ మూవీని మే 9 న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ నిర్ణయించారు.కానీ దీనికి భారత్ అనుకొని విధంగా షాక్ ఇచ్చింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 24, 2025, 04:12 PM IST
  • పాక్ కు మరో షాక్ ఇచ్చిన మోదీ సర్కారు..
  • అబీర్ గులామ్ సినిమా బ్యాన్..
Pahalgam Terror Attack: పాకిస్థాన్‌కు మరో ఝులక్..ఆ హీరో సినిమాను బ్యాన్ చేసిన భారత్..!

India govt ban on Pakistan actor fawad movie abir gulal: అనంతనాగ్ జిల్లాలోని పహల్గంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిని యావత్ భారతవనీ తీవ్రంగా తీసుకుంది. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్టులను వాళ్ల వెనుక పాక్ ను వదలేది లేదని కేంద్రాన్ని కోరుతున్నారు. మరోవైపు మోదీ సర్కారు ఇప్పటికే పాక్ ను అష్టదిగ్బందనం చేసింది. మేజర్ గా తీసుకున్న ఐదు నిర్ణయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ క్రమంలో సింధూజలాల ఒప్పందం రద్దుచేసింది.

Add Zee News as a Preferred Source

భారత్ లో పాక్ వాళ్లు 48 గంటల్లో తిరిగి పాక్ కు వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.. అటారీ బార్డర్ ను క్లోజ్ చేసి, వీసాలు రద్దు చేసింది.  రాయబార కార్యలయ సిబ్బందిని.. 50  నుంచి 30 కి తగ్గించారు. పాక్ లోఉన్న భారత్ దౌత్యాధికారుల్ని వెనక్కు రప్పించుకుంది. ఈ క్రమంలో మోదీ హైపవర్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలలో సింధుజలాల ఒప్పందను భారత్ క్యాన్షిల్ చేసుకొవడం పాక్ కు చావుదెబ్బగా చెప్పవచ్చు.

ఎందుకంటే.. పాక్ లో పంటలు పండటానికి ఎక్కువగా ఈ సింధు జలాలు ఉపయోగించుకుంటుంది. దీంతో ఈ నీళ్లు ఆగిపొవడంతో పాక్ కు మాత్రం పెద్ద కోలుకోలేని దెబ్బగా చేప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పాక్ ను మరింత ఇరకాటంలో పెట్టింది. పాక్ కు చెందిన నటుడు హీరోగా తీసిన అబీర్ గులాల్ ను భారత్ లోబ్యాన్  చేసింది. ఈ మూవీలో నటుడు ఫావాద్ ఖాన్ హీరోగా.. వాణికపూర్ హీరోయిగా చేశారు.

ఈ సినిమాను భారత్ బ్యాన్ చేసింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ మూవీ భారత్ లో విడుదలయ్యేది లేదని అధికారులు స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు కాకుండా.. ఇప్పుడు పాక్ సినిమా ఇండస్ట్రీకి సైతం మోదీ బిగ్ షాక్ ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది.

Read more: Singer Sunitha: చూడగానే టెంప్ట్ అయ్యా..!.. ఫస్ట్ క్రష్‌ గురించి షాకింగ్ నిజం రివీల్ చేసిన సింగర్ సునీత.. ట్విస్ట్ అదుర్స్...

మొత్తంగా పహల్గం ఘటనను మాత్రం భారత్ తో పాటు, యావత్ ప్రపంచ దేశాలు ఈ ముష్కర దాడిని  ఖండిస్తున్నాయి. పహల్గంలో ఆర్మీదుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News