మూవీ రివ్యూ: అగత్యా (Aghathiyaa)
నటీనటులు: యాక్షన్ కింగ్ అర్జున్, జీవా, రాశీ ఖన్నా, యోగి బాబు తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: దీపిక్ కుమార్
ఎడిటర్: సాన్ లోకేష్
నిర్మాతలు: ఇషారి కే. గణేష్ , అనీష్ అర్జున్ దేవ్
దర్శకత్వం: పా విజయ్
విడుదల తేది: 28-2-2025
యాక్షన్ కింగ్ అర్జున్ గత కొన్నేళ్లుగా హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అందులో తన పాత్ర బాగుంటేనే ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జీవా హీరోగా ‘అగత్యా’ సినిమా చేసారు. హార్రర్ - ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా విడుదలైంది.పా. విజయ్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
‘అగత్యా’ సినిమా విషయానికొస్తే.. ఇది పాండిచ్చేరి నేపథ్యంలో సాగుతుంది. అగత్యా (జీవా) సినిమా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక సినిమా కోసం ఓ ఇంటి సెట్ ను వేస్తాడు. ఎందుకో ఆ సెట్ లో సినిమా షూటింగ్ కాదు. దీంతో ఆ సెట్ ను ఓ స్కేరీ హౌజ్ లా మార్చి క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. కానీ అందులో నిజంగానే దెయ్యాలు తిష్ఠ వేస్తాయి. ఆ దెయ్యాలకు అగత్యా అంటే ఓ సాఫ్ట్ కార్నర్. అతన్ని ఏమి చేయకుండా ఇంట్లోంచి వెళ్లాగొట్టాలనుకుంటాయి. ఎంతో ఇష్టపడి సెట్ వేసిన ఆ ఇంట్లోకి దెయ్యాలు ఎందుకు వచ్చాయి. వాటికి అగత్యాకు ఉన్న సంబంధం ఏమిటి ? ఆ దెయ్యాలు అగత్యాను ఆ ఇంట్లోంచి ఎందుకు వెళ్లేగొట్టేందకు ప్రయత్నిస్తాయి. తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) పనితనం మీద నమ్మకం కోల్పోయి స్థాయి సంగీతం, నేపథ్య సంగీతం అందిచాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే సీన్ లోని ఎమోషన్ తో అసలు సంబంధమే ఉండదు. ఇక సీజీఐ విషయంలో బృందం అంత కేర్ లెస్ గా, ఆడియన్స్ ను గ్రాంటెడ్ గా తీసుకొని ఏదైనా చూసేస్తారులే అన్నట్లుగా స్టాక్ గ్రాఫిక్స్ తో నింపేసిన తీరు ఫిలిం మేకర్స్ సినిమాని ఎంత సీరియస్ గా తీసుకున్నారు అనేదానికి ఉదాహరణ. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ గ్రాఫిక్స్ ను యానిమేటెడ్ వెర్షన్ లో తెరకెక్కించడమే పెద్ద తప్పు అంటే.. దాన్ని అందులో మార్వెల్ సినిమాల ఫుటేజీలు వాడేయడం అనేది ఇంకా దారుణం.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ మధ్యకాలంలో అన్ని భాషల్లో హార్రర్ కాన్సెప్ట్ అనేది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అందులో ఆసక్తి కలిగించే అంశాలంటే ఆ సినిమా బ్లాక్ బస్టరే అని చెప్పాలి. ఇపుడు పా విజయ్ కూడా అదే తరహా ఫాంటసీ హార్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాను అంత్రాపాలజీ టైపులో చెప్పాలనుకున్నాడు. ఈ సినిమాలో నాలుగు కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. అందులో రెండు ప్యారలర్ గా రన్ అవుతుంటాయి. దీన్ని దర్శకుడు ఇంకాస్త ఇంపాక్ట్ గా చెప్పి ఉంటే వర్కౌట్ అయ్యేది. హార్రర్ సినిమాలను ఇష్టపడే వాళ్లను ఈ మూవీ ఎంగేజ్ చేయడం గ్యారంటీ. అక్కడక్కడ దెయ్యాలు ఇచ్చే ట్విస్ట్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా చేసాడు. ముఖ్యంగా అర్జున్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా రాసుకున్నాడు దర్శకుడు. సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలెట్ అని చెప్పాలి. జీవా, రాశీ ఖన్నాల మధ్య లవ్ అంతగా పండలేదు. కామెడీ సీన్స్ ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది. ముఖ్యంగా దేశభక్తి, అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. వాటిని ఇంకాస్త ఇంపాక్ట్ గా చూపించి ఉంటే బాగుండేది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
నటీనటుల విషయానికొస్తే..
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. డాక్టర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. కథను మలుపు తిప్పే కీ రోల్లో అద్భుతంగా నటించాడు. అటు జీవా కూడా ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసాడు. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులను పకలరించాడు. రాశీ ఖన్నా క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. యోగిబాబు కామెడీ ఇంకా పేలివుంటే బాగుండేది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
చివరి మాట: యాక్షన్ కమ్ ఫాంటసీల ‘అగత్యా’..
రేటింగ్: 3/5
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









