Aishwarya Rai: ముంబయిలో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణించే టయోటా వెల్‌ఫైర్ కార్‌ను స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ కారు ఖరీదు రూ. 1.30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
సెలబ్రిటీలు కార్ల విషయంలో భద్రత అనేది చాలా వరకు చూసుకుంటారు. ఐశ్వర్య రాయ్ వాడే టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ వాహనం హీట్‌డ్, వెంటిలేటెడ్ సీట్స్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఎంతో సేఫ్టీ కార్ కూడా. బాలీవుడ్ నటీనటులు ఇలాంటి లగ్జరీ కార్లను తరచుగా వాడుతుంటారు. ఇక ఐశ్వర్యరాయ్ కారు కూడా ఎంతో భద్రత ఉన్నా కానీ.. వెనకనుంచి బస్సు వచ్చి కార్ కి తగలడంతో.. కార్ కి బాగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది
ప్రమాదం జరిగిన వెంటనే ఐశ్వర్య రాయ్ భద్రతా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థిని సమర్థవంతంగా నిర్వహించారు. అయితే, ప్రమాదం సమయంలో ఐశ్వర్య కారులో ఉన్నారో లేదో స్పష్టత లేదు.
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఇటీవల దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు. అభిషేక్ క్రిమ్ షేర్వాణీలో, ఐశ్వర్య క్రిమ్ డ్రెస్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఇంతలోనే ఈ కార్ ఇన్సిడెంట్ జరగడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ కార్ లో ఐశ్వర్యారాయ్ ఉండకుండా ఉంటే బాగుంటుందని.. ఉన్నా కానీ ఆమెకు ఎటువంటి గాయాలు అవ్వకుంటే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఈ ఘటన మళ్లీ రోడ్డు భద్రతపై దృష్టి సారించేలా చేసింది. సెలబ్రిటీలతో పాటు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన గుర్తు చేసింది.
Also Read: RC 16 First Pre Look: రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ రెడీ.. RC 16 మూవీ ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్..
Also Read: School Holidays: విద్యార్ధులకు సూపర్ గుడ్‌న్యూస్, ఏప్రిల్ లో 3-4 రోజులు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి








