Garuda 2.O:హనుమాన్ మీడియా పతాకంపై గతంలో ఎన్నో విజయవంత చిత్రాలు శాకాహారి, కథ కంచికి, కాళరాత్రి, నేనే నా, సూపర్ మాచి, కాజల్ కార్తీక, టీనెజర్స్, మనం ఇంటికి లాంటి చిత్రాలు తెలుగు లో రిలీజ్ చేసిన సక్సెస్ ఫుల్ నిర్మాత బాలు చరణ్ .. తాజాగా తమిళం లో అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకున్న ‘ఆరత్తు సీనం (AArathu Sinam) సినిమాను తెలుగులో‘గరుడ 2.O’ గా విడుదల చేస్తున్నారు.
అరివాజగన్ వెంకటాచలం డైరెక్షన్ లో ‘డిమోంటి కాలనీ’ హీరో అరుళ్ నీతి తమిళరాజు, సంక్రాంతికి వస్తునాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్త హీరో హీరోయిన్ లుగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆరత్తు సీనం (Aarathu Sinam). తాజాగా ఈ సినిమాను తెలుగులో ‘గరుడ 2.O’ గా ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ చేసారు. ఆహా ఓటీటీలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
తమిళం లో గొప్ప విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకోవడం గ్యారంటీ అని చెప్పాలి. ఐశ్వర్య రాజేష్ గతంలో తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా.. వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకుంది. తాత, తండ్రి, మేనత్త కూడా నటులు కావడంతో ఐశ్వర్య రాజేష్.. వాళ్ల బాటలోనే హీరోయిన్ గా దక్షిణాది చిత్రసీమలో సత్తా చాటుతూ దూసుకుపోతుంది.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









