Good Bad Ugly Review and Rating
కథ
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కథ ‘రెడ్ డ్రాగన్ AK’ అనే పేరుతో మాఫియా డాన్‌గా వెలుగొందే (అజిత్) చుట్టూ తిరుగుతుంది. తన కుటుంబం కోసం క్రిమినల్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పిన అతను, తన కొడుక్కి గర్వపడేలా జీవించాలని మాటిస్తాడు. కానీ కొడుకు ప్రమాదంలో పడినప్పుడు..అతన్ని రక్షించేందుకు మళ్లీ మాఫియా ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఫ్యామిలీని తిరిగి కలిపే ప్రయత్నంలో, అతని జీవితం మరోసారి మలుపు తిరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా కథ.
నటీనటుల పెర్ఫార్మన్
అజిత్ ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నాడు. స్టైల్, స్వాగ్ పరంగా ఆయన అభిమానులను మెప్పించే విధంగా నటించారు. అయితే పాత్రలో అంతగా భావోద్వేగాల లోతు ఉండకపోవడంతో..సాధారణ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. త్రిషా పాత్ర చిన్నదే. గుర్తుండిపోయేంత ప్రాభవం కూడా ఏమి చూపించలేదు. ఆమె గ్లామర్ కూడా ఈ సినిమా కోసం పనిచేయలేదు. సునీల్, రాహుల్ దేవ్, యోగిబాబు, ప్రశన్న, ప్రభు, సిమ్రన్ వంటి ఇతర నటుల పాత్రలు పెద్దగా ఆకట్టుకోవు. అర్జున్ దాస్ పాత్ర మాత్రం కొంతంతవరకు మెప్పించింది.
టెక్నికల్ సిబ్బంది పనితీరు
ఈ కథకి ఎమోషనల్ బేస్ ఉన్నప్పటికీ.. కథను నడిపించిన తీరు మాత్రం.. ఒక సాధారణమైన పాత కథను తలపిస్తుంది. GV ప్రకాష్ అందించిన సంగీతం.. పాటల విషయంలో పెద్దగా ఆకట్టుకోకపోయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా స్లో మోషన్ సీన్లలో ఈ సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చేసిన అబినందన్ రామానుజం పనితీరు బాగుంది. విజువల్స్ క్వాలిటీగా ఉండేలా.. ఆయన చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా విజయ్ పనితీరు పరవాలేదు అనిపించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
విశ్లేషణ
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథ ముందే అంచనా వేయదగినదిగా ఉండటంతో, ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంలో దర్శకుడు విఫలమయ్యారు. దాదాపు కాసేపటికి సినిమా కథ మొత్తం అయిపోతుంది. హీరో ఎలివేషన్, స్లో మోషన్ షాట్స్‌పై అధికంగా ఫోకస్ చేయడం వల్ల, సినిమా లోతులేని విధంగా మారింది. ముఖ్యంగా కే జి ఎఫ్ లో లాగా ప్రతి 15 నిమిషాలకు ఒక ఎలివేషన్స్ సీన్ మాత్రం వస్తుంది. అది పక్కన పెడితే..ఎమోషనల్ ఎలిమెంట్స్, ముఖ్యంగా కొడుకుతో ఉన్న బంధం, తల్లి పాత్ర లాంటి అంశాలు సరైన ఫోకస్ లేకుండా పోయాయి. దర్శకుడు ప్రణాళికలు బాగున్నా, మొత్తం మీద మాత్రం సినిమా కేవలం పరవాలేదు అనిపించుకుంది.
తీర్పు
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా అజిత్ అభిమానుల కోసం మాత్రమే రూపొందినట్లు అనిపిస్తుంది. సామాన్య ప్రేక్షకులకు ఇది ఓవరాక్షన్, ఓవర్‌స్టైల్‌గా అనిపించవచ్చు. కథలో కొత్తదనం లేకపోవడం, ఎమోషనల్ డెప్త్ లోపించటం వల్ల సినిమా అంతగా కనెక్ట్ కాలేకపోయింది. టెక్నికల్‌గా బాగున్నా, కథా పరంగా వెనకబడిన సినిమా ఇది.
Rating: 2.5/5
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









