Ajith Health Update: హాస్పిటల్లో చేరిన హీరో అజిత్.. అవార్డు తీసుకున్న మరసటిరోజే ఇలా.. ఆందోళనలో అభిమానులు.. !

Ajith Kumar injury: తమిళ హీరో అజిత్ కుమార్‌కు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా, ఆ మరుసటి రోజే ఆయన ఆసుపత్రిలో చేరడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే ఆయనకు చిన్న గాయం తగలడం వల్లే హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందంట..   

Written by - Vishnupriya | Last Updated : Apr 30, 2025, 04:50 PM IST
Ajith Health Update: హాస్పిటల్లో చేరిన హీరో అజిత్.. అవార్డు తీసుకున్న మరసటిరోజే ఇలా.. ఆందోళనలో అభిమానులు.. !

Ajith Hospitalized : కోలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో ప్రఖ్యాతిని సంపాదించుకున్న స్టార్ హీరో.. అజిత్ కుమార్. ఈ తమిళ సూపర్ స్టార్..ఇటీవలే భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ గౌరవాన్ని పొందిన తర్వాత.. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.  అయితే ఇది జరిగిన మరొకటిరోజే..అకస్మాత్తుగా వచ్చిన ఆరోగ్య సమస్య కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరడం కలవరం రేపింది.

Add Zee News as a Preferred Source

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనను చేరవేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ నుంచి చెన్నైకి తిరిగొస్తున్న సమయంలో..ఎయిర్‌పోర్టులో భారీ సంఖ్యలో అభిమానులు తలాపై దూసుకొచ్చారు. ఈ గందరగోళంలో అజిత్ కాలికి స్వల్పంగా గాయమైందని సమాచారం. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు.

అజిత్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొనడంతో ఆయన టీమ్ స్పందించింది. “చిన్న గాయం తగిలింది. అంతటి ఆందోళన అవసరం లేదు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక అజిత్ సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు” అంటూ అధికారికంగా తెలియజేశారు. అభిమానులు స్వల్ప గాయం అని తెలిసి కొంత ఊపిరి పీల్చుకున్నారు.

అజిత్ కు పద్మ భూషణ్ అవార్డు లభించడమంటే.. ఎంతో గర్వకారణం. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి ఇది అందమైన గుర్తింపుగా భావిస్తున్నారు ఆయన అభిమానులు. 

ఇటీవలే అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విడుదలై బాక్సాఫీస్.. వద్ద మంచి విజయం సాధించింది. త్రిషా, సునీల్, అర్జున్ దాస్ లాంటి నటులతో రూపొందిన ఈ చిత్రం అభిమానులను మెప్పించింది. తదుపరి ప్రాజెక్టులకూ అజిత్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే మరో చిత్రం ప్రారంభించనున్నట్లు సమాచారం.

తలా అభిమానులు తమ హీరోకి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు. అజిత్ కు గాయం అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఆరోగ్యంపై వేల మంది ఆందోళన వ్యక్తం చేశారు. "అజిత్ త్వరగా కోలుకోవాలి" అంటూ ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు.

కాగా అజిత్ కి తగిలింది.. చిన్న గాయమే కావడంతో.. ఈరోజు లేదా రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. డిస్చార్జ్ అయిన కొద్ది రోజులకు అజిత్ తన తదుపరి సినిమా షూటింగులు ప్రారంభిస్తారేమో వేచి చూడాలి.

Also Read: Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్‌ ట్విస్ట్‌.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్

Also Read: Diesel Subsidy: ఏపీ ప్రజలకు బంపర్‌ ఆఫర్‌.. డీజిల్‌ ధరపై రూ.9 తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News