)
Ajith Emotional: పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది తనకు ప్రేరణగా నిలుస్తుందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన భార్య షాలినిపై ప్రశంసలు కురిపించారు అజిత్ . ఆమె తనకోసం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పుకొచ్చారు.
నేను ఇప్పటికీ సామాన్యుడిలాగే ఆలోచిస్తాను. ఇంతటి విజయాన్ని సాధించినందుకు ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ స్థాయిలో ఉండేందుకు నా భార్య షాలినినే కారణం. ఆమె నాకోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతి పనిలోనూ నాకు తోడుగా ఉంటుంది.కొన్ని సందర్భాల్లో నేను సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా ఆమె అండగా నిలిచింది. నన్ను ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదు. నా కష్ట సమయాల్లో పక్కనే ఉంటూ భరోసాను ఇచ్చింది. నా జీవితంలో సాధించిన విజయం అంతా ఆమెకే ఇస్తాను. ఎంతో ప్రజాదరణ పొందిన నటి అయినప్పటికీ నా కోసం అన్నింటికీ దూరమైంది. ఆమెకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా క్రుతజ్నతలు చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
నేను కేవలం నటుడిని మాత్రమే. నటన నాకు జీవితాన్నిచ్చే ఓ ఉద్యోగంగా భావిస్తుంటాను. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అలాంటి ట్యాగ్స్ పై నాకు ఎలాంటి నమ్మకం లేదు. 33ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా వ్రుత్తిని ప్రేమిస్తాను. జీవితమంతా అభిమానులను అలరించడానికే ప్రయత్నిస్తాను. సాధ్యమైనంత వరకు సాదాసీదాగానే ఉంటాను. అతిగా ఆలోచించను. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్ట్స్ అంగీకరించను. నటనతో పాటు నా ఇతర ఆసక్తులపై కూడా ఫోకస్ పెడతాను అని అజిత్ తెలిపారు.
With immense pride,
the entire team at Venus Motorcycle Tours, Aspire World Tours, and Ajith Kumar Racing congratulates our CEO, Mr. Ajith Kumar, on receiving the prestigious Padma Award.
We are excited to celebrate this moment with you and wish you many more milestones ahead.… pic.twitter.com/PhgdF8wsMQ— Ajithkumar Racing (@Akracingoffl) April 28, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe