Karma Sthalam:
'కర్మ స్థలం' చిత్రం రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అర్చన (వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను హీరో ఆకాష్ పూరి శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆకాష్ పూరితో పాటు హీరో విజయ్ శంకర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ, "కర్మ స్థలం టైటిల్ చాలా బాగుంది. మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. నేను కూడా అమ్మవారి భక్తుడినే. ఇటువంటి సినిమాలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతున్నాయి. ఇటీవలి కాలంలో హనుమాన్, కార్తికేయ, కాంతారా వంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అలాంటి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ సుబ్రహ్మణ్య గారికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశాలు కల్పించడం ప్రశంసనీయం. నేను కర్మను విశ్వసిస్తాను. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇలాంటి కథలో నటించాలని ఉంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్" అని అన్నారు.
హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ, "కర్మ స్థలం టైటిల్ వినగానే గౌరవాన్ని కలిగించేలా ఉంది. సినిమా ప్రమోషన్స్ మొదటి నుంచి బాగా చేస్తున్నారు. మంచి కథలతో సినిమాలు తీస్తున్నారు కానీ ప్రమోషన్స్‌లో కొంత వెనుకబడుతున్నారు. ఈ సినిమా మాత్రం మంచి ప్రచారం అందుకుని విజయం సాధించాలి. టాలీవుడ్‌లో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. వారికి సరైన ప్రొడ్యూసర్స్ దొరికితే రాజమౌళి, సుకుమార్‌లా సక్సెస్ అవుతారు. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
నటుడు సతీష్ సరిపల్లి మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్ట్ చిన్నదిగా ప్రారంభమై పెద్ద స్థాయికి ఎదిగింది. దర్శకుడు రాకీ విజువల్స్ పరంగా అద్భుతమైన పనితనం కనబరిచారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది" అని చెప్పారు.
హీరోయిన్ మితాలి చౌహాన్ మాట్లాడుతూ, "ఈ సినిమాలో నా పాత్ర ద్వారా మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. డైరెక్టర్ రాకీకి ధన్యవాదాలు" అన్నారు.
నటుడు క్రాంతి కిల్లి మాట్లాడుతూ, "ఇటీవల కాశ్మీర్ స్టోరీస్, కేరళ స్టోరీస్, రజాకార్ వంటి సినిమాలు హిందూ ధర్మాన్ని తెలియజేయడం జరిగింది. ఇలాంటి కథలో భాగం కావడం గర్వంగా ఉంది. కర్మ స్థలం తరువాత కుంభస్థలం కూడా రాబోతోంది" అని తెలిపారు.
దర్శకుడు రాకీ మాట్లాడుతూ, "పండుగలను మనం ఎంజాయ్ చేస్తాం, కానీ వాటి వెనక ఉన్న చరిత్ర గురించి కొంతమందికి తెలియదు. ఈ సినిమాలో మహిషాసుర మర్ధిని వంటి శక్తిమంతమైన అంశాలను ప్రస్తావించాం. ఈ సినిమా ద్వారా గొప్ప సందేశాన్ని అందించబోతున్నాం" అని అన్నారు.
'కర్మ స్థలం' సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఆధ్యాత్మికత, కర్మ సిద్ధాంతం, ధర్మంపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: Sister Murder: ఇన్నాళ్లు భార్యాభర్తలు చంపుకోగా.. ఇప్పుడు సొంతక్కను అత్యంత దారుణంగా
Also Read: Water Bottle Fine: వాటర్ బాటిల్‌కు ఎక్స్‌ట్రా రూ.27 తీసుకున్నందుకు రూ.27 లక్షల భారీ జరిమానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









