Akhanda 2 First Single: నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందున్న నాలుగో చిత్రం 'అఖండ 2'. ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడం వల్ల ప్రమోషన్స్‌ను చిత్రబృందం హుషారుగా ప్రారంభించింది. ఇప్పటికే రెండు టీజర్లు విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి 'అఖండ తాండవం' సాంగ్ విడుదల అయ్యింది. శుక్రవారం ఈ చిత్రబృందం లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
'అఖండ' సినిమాలో మాదిరిగానే రెండో పార్ట్‌లోనూ బాలయ్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన 'అఖండ తాండవం' సాంగ్ ను కల్యాణ్ చక్రవర్తి రచించగా.. ప్రముఖ సింగర్స్ శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ ఆలపించారు. తమన్ ఎస్ఎస్ సంగీతాన్ని సమకూర్చారు. మరోసారి తమన్ తన మ్యూజిక్‌తో వెండితెరపై మ్యాజిక్ చేసేలా ఉంది ఈ లిరికల్ సాంగ్. అయితే ఈ చిత్రంలో సాంగ్స్ మాత్రం తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కథకి అనుగుణంగా మాత్రమే సాంగ్స్ ఎంచుకోవడం వల్ల అనవసరమైన పాటలకు తావు లేకుండా చేశారట. దీంతో ప్రేక్షకుడు కథతో సాగే అనుభూతి కలిగేలా బీజీఎమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
బాలయ్య-బోయపాటి-తమన్ కాంబోలో రూపొందుతున్న సినిమా కారణంగా ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో హిస్టరీ రిపీట్ అవ్వబోతుందని నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









