
Akhanda 2 Teaser Review : బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా.. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బాలకృష్ణ కెరియర్ లోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రం క్లైమాక్స్ లోనే ఈ దర్శకుడు ఈ సినిమాకి రెండోభాగం కూడా ఉండబోతోంది అన్న క్లారిటీ ఇచ్చారు.
ఇక అప్పటినుంచి నుంచి ఈ చిత్రం రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ 2 టీజర్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను బాలయ్య బాబు పుట్టినరోజు కానుకగా.. సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఇక ఈ టీజర్ అంచనాలకు మించి ఉండడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
“నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు. అలాంటిది నువ్వు చూస్తావా..” అంటూ బాలకృష్ణ డైలాగ్ తో మొదలైన ఈ టీజర్.. ఆ తరువాత బాలయ్య మాస్ వైలెన్స్ తో పూనకాలు తెప్పించింది. ఇక విలన్ షార్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఇక తమన్నా అఖండ మొదటి భాగం లాగానే రెండో భాగం బిజిఎం కూడా అదరగొట్టాడు. మొత్తం పైన టీజర్ చూస్తేనే ఇది బాలయ్య, బోయపాటి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టబోతోంది అని అర్థమవుతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా..హైందవం ఉట్టి పడేలా టీజర్ ను కట్ చేశారు. బాలయ్య మాస్ పల్స్, రౌద్రం అన్నీ కలబోసినట్టు.. బోయపాటి ఈ టీజర్ ను రెడీ చేశారు. బాలయ్య ఫ్యాన్స్.. అలానే బోయపాటి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ టీజర్ లో నింపేశారు. ఇక అన్నిటికన్నా సర్ప్రైజ్ ఏమిటి అంటే.. ఈ సినిమా విఎఫ్ఎక్స్ వరకు కూడా ఈ టీజర్ లో అద్భుతంగా ఉంది. ఇక ఈ చిత్రం.. రీసెంట్ గానే జార్జియాలో భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని..సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా.. మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ నటిస్తుండగా.. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సినిమాని నిర్మిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.