బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 రిలీజ్ కు రెడీ అయ్యింది. దీంతో మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వారం రోజులు ఆలస్యంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నెల 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అంతేకాదు ఒక రోజు ముందు ఈ సినిమా భారీ ఎత్తున ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే ఏపీలో మరోసారి కొత్త డేట్స్ తో ఈ సినిమా రేట్లు పెంచకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. ప్రీమియర్స్ కు రూ. 600, ఇక పది రోజుల పాటు మల్టీప్లెక్స్ లో రూ. 100, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 75 పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది.
మరోవైపు తెలంగాణలో కొత్త డేట్ తో రేవంత్ సర్కార్ గతంలో జీవో జారీ చేసింది. మరోసారి కొత్త డేట్స్ తో అనుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలో ప్రీమియర్స్ రూ. 600 పెంచనున్నారు. ఇక మూడు రోజులు పాటు మల్టీప్లెక్స్ లో రూ. 100, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 75 పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వనున్నారు. దీనిపై మరో కాసేపట్లో అనుమతులు రానున్నాయి.
Read more: Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..
Read more: నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు..
‘అఖండ 2’ భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు మూవీ యూనిట్ రెడీ అయ్యింది. అటు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే థియేటర్స్ దగ్గర హడావుడి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టికెట్స్ కోసం ఒకేసారి అందరు బుక్ మై షో ఓపెన్ చేయడంతో కొన్ని గంటల పాటు ఈ సైట్ క్రాష్ అయింది. ప్రస్తుతం ఏపీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరికాసేట్లో తెలంగాణ ప్రభుత్వం అనుమతులు రాగానే బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఇక మరికొన్ని గంటల్లో తెరమీద తమ హీరోను చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









