)
పుష్ప 2 తర్వాత ఎలాంటి ప్రీమియర్స్ కు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వమని చెప్పిన తెలంగాణలోని రేవంత్ సర్కార్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ మూవీకి ప్రీమియర్స్ తో పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. కానీ అఖండ 2 తాండవం విషయంలో చిత్ర నిర్మాతలకు రేవంత్ రెడ్డి సర్కారు పెంపుదల ఉండదని చెప్పినట్టు సమాచారం. కేవలం ప్రీమియర్స్ కు మాత్రమే పర్మిషన్స్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు అఖండ 2 టిక్కెట్లు ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షో ధర 600, 5వ తేదీ నుంచి మల్టీప్లెక్స్‌లలో 100, సింగిల్ థియేటర్ 75 రూపాయలు పెంపునకు అనుమతి మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. 10 రోజుల వరకు ఈ ధరల పెంపునకు వర్తింపు ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో ఉంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా అఖండ 2 తాండవం. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలకృష్ణ చిన్న కూతురు ఎం తేజస్విని నందమూరి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు ఇది ఫస్ట్ మూవీ అని చెప్పాలి.
అఖండ 2 తాండవం మూవీకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానుల్లో అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి. అఖండ 2 తాండవం 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటిసారి బాలకృష్ణ నటించిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హిందీ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా బాలయ్య కెరీర్ లో తొలిసారి రూ. 114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.