Agent OTT Streaming: ఎట్టకేలకు అఖిల్ ‘ఏజెంట్’ మూవీకి ఓటీటీ స్ట్రీమింగ్ కు మోక్షం..అధికారిక ప్రకటన..

Agent OTT Streaming: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్’.  సాధారణంగా ఏదైనా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తాయి. కానీ అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ అందుకు భిన్నంగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం దాదాపు రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 6, 2025, 07:43 AM IST
Agent OTT Streaming: ఎట్టకేలకు అఖిల్ ‘ఏజెంట్’ మూవీకి ఓటీటీ స్ట్రీమింగ్ కు మోక్షం..అధికారిక ప్రకటన..

Agent OTT Streaming:  కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎన్నో కష్టానష్టాలను భరించాల్సి వచ్చింది. ముమ్ముట్టి మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైర్మెంట్స్ పై అనిల్ సుంకర భారీ ఎత్తున నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల తిరస్కరానికి గురైంది. తాజాగా ఈ సినిమా దాదాపు రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.స్పై థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను అభిమానించే ప్రేక్ష‌కులు ఇప్పుడు హై యాక్ష‌న్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌  తో ఈ సినిమాను   డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెరకెక్కించారు.

Add Zee News as a Preferred Source

అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఏజెంట్ మూవీని సోనీ లివ్‌లో  ఈ నెల  14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రికీ అనే టాలెంటెడ్‌ రా ఏజెంట్‌కు ఓ క్లిష్ట‌మైన మిష‌న్‌ను పూర్తి చేయాల్సిన బాధ్య‌త‌ను అప్ప‌గిస్తారు. ది డెవిల్ అనే పిల‌వ‌బ‌డే రా చీఫ్ క‌ల్న‌ల్ మ‌హాదేవ్ ఈ ప‌నిని రికీకి అప్ప‌గిస్తాడు. ఈ క్ర‌మంలో రికీ ర‌హస్యంగా ఈ ప‌నిని పూర్తి చేసాడా.. ? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. మ‌రో వైపు ధ‌ర్మ అలియాస్ గాడ్ అనే మాజీ రా ఏజెంట్ భార‌తదేశాన్ని నాశ‌నం చేయ‌టానికి  ఎలాంటి ప‌థ‌కం వేస్తాడు. మిష‌న్ అనుకోని మ‌లుపులు తీసుకుంటుంది. దీంతో ఏం జ‌రుగుతుందో చూడాల‌నుకుంటున్న ప్రేక్ష‌కుల‌ అంచ‌నాలు పీక్స్ లో ఉంటాయి.          

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.                                                                                                                      

‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో పాటు మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య‌, డెంజిల్ స్మిత్‌, విక్ర‌మ్‌జీత్ విర్క్ ముఖ్యపాత్రల్లో నటించారు.  వీరు త‌మ యాక్టింగ్ తో  సినిమాను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ అందించిన క‌థ‌కు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి సినిమాకు స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేంద‌ర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర‌, అజ‌య్ సుంక‌ర‌, ప‌తి దీపా రెడ్డి ఈ చిత్రాన్నిప్రొడ్యూస్ చేసారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News