Akira: అకిరా నందన్ మొదటి సినిమాకి అస్సలు ఎవ్వరు ఊహించని డైరెక్టర్ ఫిక్స్..!

Akira Debut: పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ తొలిసినిమా ఎప్పుడు ప్రారంభం కానుందనే.. ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, ఈ చిత్రానికి ఓ ప్రముఖ తమిళ దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు.  వార్తలు వెలువడుతున్నాయి.    

Written by - Vishnupriya | Last Updated : Mar 2, 2025, 04:29 PM IST
Akira: అకిరా నందన్ మొదటి సినిమాకి అస్సలు ఎవ్వరు ఊహించని డైరెక్టర్ ఫిక్స్..!

Akira Nandan Debut: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీపై చాలా కాలంగా చర్చలు సాగుతున్నాయి. అకీరా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నాడని ఎన్నో వార్తలు వినిపిస్తున్నా, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం బయటకొచ్చింది.  

Add Zee News as a Preferred Source

Akira First Film Director; అకీరా నందన్ మొదటి సినిమాకు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌తో ‘పంజా’ సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్, ఇప్పుడు అకీరా నందన్‌ను లాంచ్ చేయనున్నారని సమాచారం.  అయితే పవన్ కళ్యాణ్ పంజా సినిమా పెద్దగా విజయం సాధించలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన కొడుకు మొదటి సినిమా తనతో ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడు చేతిలో పెడుతున్నారేమిటి.. అని ఎంతోమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. ఈ దర్శకుడిని కాకుండా మరోదర్శకుడు ఎవరన్నా పవన్ కళ్యాణ్ ఎంచుకుంటే బాగుండు అని..ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు 

Akira First Film Producer ;ఇక మరోపక్క..టాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత అశ్వినీ దత్, అకీరా నందన్ తొలి సినిమాను నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. మహేశ్ బాబు, రామ్ చరణ్‌లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన, ఇప్పుడు అకీరా నందన్‌ను కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.  

Akira Debut Film Shooting ;ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, అకీరా నందన్ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుందని భావిస్తున్నారు. కొంతమంది ఈ చిత్రం 2026లో విడుదల అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.  

ప్రస్తుతం అకీరా నందన్ విశాఖపట్నంలో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నటనలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.  

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ తనయుడిగా కాకుండా, తన టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశంతో అకీరా కృషి చేస్తున్నట్లు సమాచారం.  కొన్నాళ్లు వేచి చూస్తే, అకీరా నందన్ తొలి సినిమా గురించి మరిన్ని విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read more: Two Snakes Video: వామ్మో.. రెండు ఎలుకల్ని ఒకేసారి గుటుక్కున మింగేస్తున్న రెండు తలల పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News