Pahalgam Terror Attack: పహాల్గాంలోనే నా బర్త్ డే చేసుకున్నా..!.. ఉగ్రదాడిపై సీరియస్ అయిన విజయ్ దేవర కొండ.. ఏమన్నారంటే..?

pahalgam attack latest news: ఇటీవల పహాల్గంలో ఉగ్రవాదులు టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. హిందువులే టార్గెట్ గా ఈ దమన కాండ కొనసాగింది. అయితే.. ఈ ఘటపై ప్రస్తుతం అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు  స్పందిస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 23, 2025, 05:33 PM IST
  • పహాల్గంపై దాడి ఘటన..
  • ఖండించిన విజయ్ దేవర కొండ..
Pahalgam Terror Attack: పహాల్గాంలోనే నా బర్త్ డే చేసుకున్నా..!.. ఉగ్రదాడిపై సీరియస్ అయిన విజయ్ దేవర కొండ.. ఏమన్నారంటే..?

Vijay deverakonda condemn Jammu kashmir terror attack: జమ్ముకశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలోని పహల్గంలో ఇటీవల ఉగ్రవాదులు ఆర్మీదుస్తులు ధరించి వచ్చి... టూరిస్టుల మీద ఇష్టమున్నట్లు కాల్పులకు తెగ బడ్డారు.  అంతేకాకుండా.. హిందువులను టార్గెట్ చేసుకుని హతమార్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తప్పకుండా ప్రతీకారం ఉండాల్సిందేనంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

అంతేకాకుండా.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది వరకు ప్రాణాలు విడువగా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి వరకు తమ వాళ్లతో ఆనందంగా ఉన్నవారంత.. ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పహాల్గంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.

దీనిపై పార్టీలకు అతీతంగా..రాజకీయ నేతలు, సెలబ్రీటీలు ఈ ఘటనను ఖండిస్తున్నారు. ఇది పిరికి పంద చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ  ఘటనపై రౌడీ హీరో విజయ్ దేవర కొండ స్పందించారు.  జమ్ములోని పహాల్గంలో జరిగిన దాడి బాధకరమన్నారు. ఆ కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ఆ దేవుడు అండగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో విజయ్ గతంలో పహాల్గంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
 
రెండేళ్ల క్రితం తన పుట్టినరోజును పహల్గామ్‌లోనే జరుపుకున్నానని, ఒక సినిమాకు షూటింగ్ కూాడా అక్కడ చేశామన్నారు. అక్కడి స్థానిక ప్రజల ఆప్యాయత, అనుబంధంతో తమను ప్రేమగా చూసుకున్నారన్నారు. ఇప్పటికి వాళ్ల ప్రేమను గుర్తు చేసుకుంటు ఉంటానన్నారు.  ఈ క్రమంలో.. నిన్న జరిగిన సంఘటన హృదయ విదారకమని చెప్పారు. ఈ దారుణ ఘటన ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తోందని అన్నారు. టూరిస్టులపై కాల్పులు జరపడం దారుణమని విజయ్ చెప్పారు.

ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నానని... ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున నిలబడదామని, భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదుల చర్యలకు తలవంచదని, అదే విధంగా ముష్కరులకు వ్యతిరేకంగా నిలబడదామని విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా తెలిపారు.

Read more: Pak Army Chief Asim Munir: కుట్రను వారం ముందే చెప్పిన పాక్ ఆర్మీ చీఫ్..?.. భారత్  ఇంటెలిజెన్స్ లైట్ తీసుకున్నారా..?..  

ఇదిలా ఉండగా..పహల్గామ్‌ ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్,  జూనియర్ ఎన్టీఆర్, నాని, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు.ఈ అమానుష ఘటనను ఖండించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News