Celebrities Response On Pahalgam: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న బైసారన్ వ్యాలీలో.. మంగళవారం చోటు చేసుకున్న ఉగ్రదాడి.. దేశాన్ని కుదిపివేసింది. ఈ ఘటనతో భారతదేశం మొత్తం ప్రస్తుతం నిరాశ నెలకొంది. ఈ దాడిలో కనీసం 26 మంది పైగా మరణించారు. మరణించిన వారిలో.. ఎక్కువగా అక్కడికి వచ్చిన.. పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో నిరాశనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన దేశ ప్రజలందరికీ..తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేస్తుంది.
ఈ క్రమంలో..ఈ దాడి తర్వాత "All Eyes On Pahalgam" అనే సోషల్ మీడియా ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్ కింద న్యాయాన్ని డిమాండ్ చేస్తూ, బాధితుల పట్ల మానవీయతను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు.
ఈ ట్రెండ్ బుధవారం ఉదయం ఒక జర్నలిస్ట్ షేర్ చేసిన AI image ద్వారా ప్రారంభమైంది. ఆ చిత్రంలో ఒక మహిళ తన భర్త రక్తపు మడుగులో పడి ఉండగా వెక్కిళ్ళు పెడుతూ కనిపిస్తుంది. ఆ చిత్రం పైన "All Eyes On PAHALGAM" అనే పదాలు కనిపించగా.. కాశ్మీర్ భూభాగం ఆకారాన్ని రక్తంతో చూపించారు.
ఈ చిత్రం సోషల్ మీడియాలో.. కొన్ని గంటల్లోనే.. మిలియన్ల షేర్లతో విస్తృతంగా వైరల్ అయింది. ప్రముఖ సినీ నటులు రామ్ చరణ్, రణదీప్ హుడా, విజయ్ వర్మ లాంటి వారు సైతం.. ఈ చిత్రాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ తమ దిగులును వ్యక్తపరిచారు.
రణదీప్ హుడా ట్వీట్‌లో, "పహల్గాం లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడి నన్ను బాగా కలచివేసింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి చర్యలను మనం ఏకతాటిపై నిలబడి ఖండించాలి. న్యాయం త్వరితగతిన జరగాలి. మన ప్రజల భద్రత ఒక తత్వవాద సమస్యగా కాకుండా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశంగా మారాలి" అని పేర్కొన్నారు.
ఈ దాడికి స్పందనగా, కాశ్మీర్‌లో భద్రతా చర్యలు మరింత కఠినంగా చేపట్టబడ్డాయి. బుధవారం మరణించిన వారిని.. శ్రీనగర్‌కి తీసుకురాగా, పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) లో వీరికి నివాళి అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో ఉన్న పర్యటనను మధ్యలో నిలిపివేసి బుధవారం తెల్లవారుజామున భారత్‌కి తిరిగివచ్చారు. ఆయన అత్యవసర భద్రతా మంత్రిమండలి సమావేశాన్ని (CCS) నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, పలు పౌరసంఘాలు, రాజకీయ పార్టీలు ఉగ్రదాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ దాడి పర్యాటకులపై భద్రతపై కీలక ప్రశ్నలు లేవనెత్తింది. బాధిత కుటుంబాల జీవితం ఒకేసారి మూగబోయింది.
ఇదీ చదవండి: అప్పటి వరకు శ్రీనర్‌కు జీరో ఫ్లైట్ కేన్సలేషన్ ఛార్జీలు.. విమానాయన సంస్థల ప్రకటన..
ఇదీ చదవండి: భయం.. బాధ.. పేరెంట్స్‌ను కోల్పోయి గుక్కపెట్టి ఏడ్చిన పిల్లల వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









